బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కరోనా బారిన పడ్డాడు. ఆయనకు కరోనా సోకినట్టు ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఆమిర్ ఖాన్ ప్రస్తుతం తన ఇంటిలోనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారని ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో ఆమిర్ ఖాన్ ను కలిసి వ్యక్తులు సైతం కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు.