ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు సంపాదించాడు విజయ్ సేతుపతి. కంపెనీ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తనదైన నటనతో ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూ మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రల్లో నటిస్తూ విలన్ గా అవకాశాలు వచ్చినా కాదనకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ ఏడాది ఆయన విలన్ గా నటించిన ఉప్పెన సినిమా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నిజానికి పిజ్జా అనే సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు