సినిమాలు నటించడం మానేసి ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్న పొలిటికల్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన ఎల్లుండి విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది లో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. తన సినిమాలలో చిరంజీవి ప్రస్తావన తీసుకురావడం కోసం పవన్ కళ్యాణ్ కు గతంలో కూడా అలవాటు ఉంది.చిరంజీవి ప్రస్తావన కుదరకపోతే కనీసం అతడి కటౌట్ ని అయినా పవన్ నటిస్తున్న సినిమాలలో బ్యాక్ డ్రాప్ గా చూపెడుతూ ఉంటారు. ఈసారి కూడా అత్తారింటికి దారేది లో చిరంజీవి ప్రస్తావన కు సంబంధించిన ఒక సన్నివేశం ఉంది అని అంటున్నారు. ఈ సినిమాలో ఒక సందర్భంలో చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాలోని సీన్ వస్తుందట.

ఆ సీన్ చూసి పవన్ కళ్యాణ్ ‘ఈయన ఎవరు..? ఇంత బాగా నటిస్తున్నాడు..?’ అని అంటాడట. అప్పుడు పవన్ పక్కన ఉన్న పక్క పాత్ర ‘ఆయన చిరంజీవి అనే మెగా హీరో, ప్రస్తుతం ఆయన నటించడం లేదు, రాజకీయాలలో ఉంటున్నాడు, కాని వాళ్ళ అబ్బాయి నటిస్తున్నాడు’ అని అంటాడట. అసలే పవన్ కళ్యాణ్ సినిమా. పవన్ అభిమానులతో కిక్కిరిసిపోయిన ధియేటర్ లలో చిరంజీవి ప్రస్తావన వస్తే ఇక తట్టుకోగలమా..? థియేటర్స్ అన్నీ ఈలలతో, చప్పట్లతో మారుమోగి పోతాయి. మరి అటువంటి సీన్స్ చూడాలి అంటే ఎల్లుండి వరకూ ఆగాలి మరి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: