సినిమాల నిర్మాణ విషయంలో పెరిగిపోతున్న ఖర్చును నియంత్రించడానికి హద్దు అదుపు లేకుండా పెరిగిపోతున్న టాప్ హీరోల పారితోషికాన్ని నియంత్రించడానికి నిర్మాత హక్కులను పరిరక్షిస్తూ ఏర్పాటు చేయబడ్డ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం మహేష్ అల్లు అర్జున్ లకు ఊహించని షాక్ ఇచ్చింది అన్న ప్రచారం జరుగుతోంది. ఈ సంకాంత్రి రేసుకు వచ్చిన ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ రియల్ కలక్షన్స్ ఫిగర్స్ తమకు కావాలి అంటూ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇప్పటికే ఈ మూవీ నిర్మాతలను కోరినట్లు తెలుస్తోంది. 


ఈ మధ్యనే జరిగిన ప్రొడ్యూసర్ గిల్డ్ సమావేశంలో టాప్ హీరోల సినిమాలకు సంబంధించి కలక్షన్ ఫిగర్స్ ను బహిరంగంగా ప్రకటించే ముందు ప్రొడ్యూసర్ గిల్డ్ అనుమతి తీసుకోవాలి అంతేకాకుండా ఈ ఫిగర్స్ ను తమ గిల్డ్ మాత్రమే మీడియాకు అనౌన్స్ చేస్తుందని మెలిక పెట్టినట్లు టాక్. దీనితో ప్రస్తుతం ఈ గిల్డ్ తీసుకున్న నిర్ణయం పై వాదోపవాదాలు జరుగుతున్నాయి.


ఒక సినిమాకు సంబంధించిన కలక్షన్స్ ఫిగర్స్ ఆ మూవీ తీసిన నిర్మాతలకు సొంతమని ఆ ఫిగర్స్ ను తామెందుకు అధికారికంగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ కు ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ గిల్డ్ కార్యనిర్వాహక వర్గం మాత్రం వేరేగా సమాధానం ఇస్తోంది అని తెలుస్తోంది. 


ఒక భారీ సినిమాను కొనుక్కుని నష్టాలు వస్తే ఆ మూవీ బయ్యర్లు తమ వద్దకు వచ్చి న్యాయం చేయమని అడుగుతున్నారని అలాంటి పరిస్థితులలో బయ్యర్లకు న్యాయం చేయాలి అంటే తమకు ఒరిజినల్ ఫిగర్స్ ఇచ్చి తీరవలిసిందే అంటూ ప్రోద్యూసర్ గిల్డ్ కార్యనిర్వాహక వర్గం వాదిస్తున్నట్లు సమాచారం. దీనితో రానున్న రోజులలో టాప్ హీరోల సినిమాలకు సంబంధించి కలక్షన్స్ పోష్టర్ల హడావిడి ఇక ఉండక పోవచ్చని ఈ విధానం అనుసరిస్తే టాప్ హీరోలందరికీ ఊహించని షాక్ వచ్చినట్లే అంటూ ఇండస్ట్రీలోని వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: