మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో భారీ క్రేజ్ తో వస్తున్న సినిమా ఆచార్య. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒక సర్ ప్రయిజ్ రోల్ లో మహేష్ నటిస్తాడని వార్తలు వచ్చాయి. కొరటాల శివతో ఆల్రెడీ రెండు సినిమాలు తీసి హిట్ అందుకున్న మహేష్, చిరు సినిమాలో ఆ పాత్రకు ఒకే చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే మధ్యలో ఏమైందో ఏమో కానీ ఆ సినిమా మహేష్ చేయట్లేదని కన్ఫర్మ్ అయ్యింది. మహేష్ పరశురామ్ డైరక్షన్ లో సినిమాకు ఉగాదిని ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. చిరు సినిమా ముందు చేయాలని అనుకున్నా తర్వాత మాత్రం మహేష్ వెనక్కి తగ్గాడట. 

 

మహేష్ చిరంజీవి సినిమా చేయకపోడానికి కారణం మహేష్ సతీమణి నమ్రత అని అంటున్నారు. మహేష్ చేసేది  చిన్న పాత్ర అయినా తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వాలని ఆమె అడిగిందట. మహేష్ రెమ్యునరేషన్ మిగతా విషయాలన్నీ చూసుకుంటున్న నమ్రత చిరు సినిమాలో మహేష్ పాత్ర ఎంతైనా సరే ఒక సినిమాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వాలని అడిగారట. అందుకే మహేష్ కు అంట ఇవ్వడం కష్టమని భావించి మహేష్ ప్లేస్ లో ముందు అనుకున్న చరణ్ ను కొనసాగిస్తున్నారట. ఆ సినిమాకు చరణ్ ప్రొడ్యూసర్ కూడా కాబట్టి రెమ్యునరేషన్ కూడా తక్కువ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. 

 

అందుకే మహేష్ చిరంజీవి సినిమా నుండి తప్పుకున్నారట. ఒకవేళ రెమ్యునరేషన్ కారణాలు కాకుండా వేరే రీజన్స్ ఏవి సినిమా మిస్ అయ్యేలా చేయవని ఫిల్మ్ నగర్ టాక్. ఏది ఏమైనా ఒక రేర్ కాంబినేషన్ మెగా సూపర్ స్టార్స్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే చూడాలని అనుకున్న ఫ్యాన్స్ కోరిక కలగానే మిగిలిపోయేలా ఉంది. మహేష్ తన నెక్స్ట్ సినిమా అప్డేట్ విషయంలో ఎప్పటిలానే కన్ ఫ్యూజన్ మెయింటైన్ చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: