తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం యూత్లో బాగా క్రేజ్ తెచ్చుకున్న హీరోల్లో ఒకరు విశ్వక్ సేన్. కేవలం సినిమాలలోనే కాకుండా తన ఆటిట్యూడ్తో కూడా అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు. ప్రస్తుతం యువ హీరోలలో  దూసుకుపోతున్నాడు విశ్వక్సేన్. వెళ్ళిపోమాకే అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన విశ్వక్సేన్... ఈ నగరానికి ఏమైంది సినిమాలో  మెయిన్ రోడ్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత ఫలక్ నుమా  దాస్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ చూపు  మొత్తం తన వైపుకు తిప్పుకున్నాడు. ఇక మొన్నటికి మొన్న నాని నిర్మించిన సినిమా హిట్ తో మంచి సక్సెస్ అందుకుని దూసుకుపోతున్నాడు ఈ యువ హీరో. 

 

 

 ఇక ఎప్పుడూ తన మాటలతో కూడా అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. టాలెంట్ ఉంటే ఎవరైనా ఎదగొచ్చు అని అందరిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు ఈ యువహీరో. అయితే తాజాగా విశ్వక్సేన్ ఓ  ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలు, తన కుటుంబం గురించి చెప్పుకొచ్చాడు. తను అందరూ కోపిష్టి అంటున్నప్పటికీ... తన లో  స్నేహశీలత కూడా ఎక్కువగా ఉంటుంది అని తన స్నేహితులు చెబుతూ ఉంటారు అని విశ్వక్సేన్ తెలిపాడు. అయితే తనలో స్నేహశీలత ఎక్కువగా ఉండడానికి కారణం మా అమ్మ అంటూ చెప్పుకొచ్చాడు. స్నేహితులతో ఎంత ప్రేమగా మెలగాలి అనే విషయాన్ని మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను అంటూ విశ్వక్సేన్ చెప్పుకొచ్చాడు. 

 

 

 మా అమ్మ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం పాతిక మందికి కూడా అన్నం పెట్టకుండా ఉన్నది నేను చూసింది లేదు అంటూ తెలిపాడు. ఇక ఈ ప్రపంచంలో నేను భయపడి ఒకే ఒక వ్యక్తి మా అక్క. ప్రస్తుతం మా నాన్న చేస్తున్న బిజినెస్ మా అక్కడ  చూసుకుంటూ ముందుకు తీసుకెళుతోంది. నేను ఏ విషయంలో తప్పు దారిలో వెళ్తున్న నన్ను కంట్రోల్ చేసి సరైన దారిలో వెళ్ళేలా చేస్తుంది అంటూ విశ్వక్సేన చెప్పుకొచ్చాడు. అయితే ఫలక్నామా దాస్ సినిమా సొంతంగా నేను దర్శకత్వం వహించి సొంత డబ్బులతో నిర్మించిన సినిమా అంటూ తెలిపిన విశ్వక్సేన్... ఈ సినిమాలో  కాస్ట్యూమ్ డిజైనర్గా అమ్మ అక్క పని చేశారు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే మా అక్క అమ్మ డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ నచ్చక ముంబై నుంచి వచ్చిన హీరోయిన్ దురుసుగా  ప్రవర్తించడంతో అప్పటికే కోపిష్టి అయిన నేను ఆ హీరోయిన్ను  సినిమా నుంచి తీసేసాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే హిట్ సినిమాతో ట్రాక్ లో పడ్డ విశ్వక్సేన్  ప్రస్తుతం పాగల్ అనే సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: