ప్రస్థుతం ప్రపంచం కరోనా ముందు కరోనా తరువాత అని చెప్పుకునేలా పరిస్థితులు ఏర్పడటంతో అన్ని రంగాలలోను పెను మార్పులు సంభవించబోతున్నాయి. కోట్లాదిమందికి వినోదాన్ని పంచే ఫిలిం ఇండస్ట్రీ సినిమా కథల విషయంలో కూడ కరోనా ఎఫెక్ట్ తో పెను మార్పులు సంభవించబోతున్న విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియచేసాడు.


‘మర్డర్’ ‘బర్ఫీ’ లాంటి మెప్పించే చిత్రాలకు దర్శకత్వం వహించిన అనురాగ్ బసు లేటెస్ట్ గా ‘లూడో’ అనే మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. కరోనా ఎఫెక్ట్ తో రానున్న రోజులలో సినిమా కథల విషయంలో చాల విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయని అనురాగ్ బసు అభిప్రాయపడుతున్నాడు. 


అంతేకాదు కొంతకాలంపాటు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తీయబోయే సినిమా కథలకు కరోనా నేపధ్యం ఉంటుందని మరో పెద్ద విపత్తు వచ్చే వరకు జనం కరోనా ను మరిచిపోరని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు రానున్న రోజులలో జనం ధియేటర్లలో కన్నా డిజిటల్ స్ట్రీమింగ్ వేదికల పైనే సినిమాలు ఎక్కువగా చూస్తారని ఇక భవిష్యత్ లో కొంతకాలం భారీ సినిమాల నిర్మాణం ఉండకపోవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. 


ప్రస్తుతం మారిన పరిస్థితులలో ప్రజల ఆలోచనలు మారి వాస్తవ దృష్టి పెరగడంతో కథలలో వాస్తవికత లేకపోతే జనం చూడరు అన్న అభిప్రాయం కూడ అనురాగ్ బసు చెపుతున్నాడు. అంతేకాదు గతంలో లా ఒక సినిమా పై మరొక సినిమా పోటీగా విడుదలయ్యే రోజులు ఇప్పుడు ఉండకపోవచ్చానీ అందువల్ల సినిమాలు అన్నీ ప్రణాళికాబద్ధంగా విడుదల చేయవలసిన పరిస్థితులు ఏర్పడటంతో భవిష్యత్ లో సినిమాల నిర్మాణ సంఖ్య గణనీయంగా తగ్గుతుంది అన్న సంకేతాలు ఇస్తున్నాడు. దీనివల్ల హీరోలు హీరోయిన్స్ కంటే సినిమా యూనిట్ లో పనిచేసే దినసరి కూలీలు నష్టపోవడంతో వారికి ఈపని తప్ప మరొక పని తెలియక పోవడంతో వీరందరినీ భరించడం ప్రభుత్వాలకు పెను సమస్యగా మారుతుందని అనురాగ్ బోసు అభిప్రాయం..  

మరింత సమాచారం తెలుసుకోండి: