తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖుల బయోపిక్లో తెరకెక్కాయి . అంతే కాకుండా ఇంకా ఎంతో మంది సినీ ప్రముఖుల బయోపిక్లు తెరకెక్కించేందుకు సన్నాహాలు కూడా లోలోపల  జరుగుతున్నాయి. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికి ఊహకందని... బయోపిక్ ఏదైనా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయోపిక్ అని చెప్పొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి  టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఏ హీరోకి లేనంత క్రేజ్ సంపాదించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ కి  ఉన్నంత మంది అభిమానులు ఏ హీరోకి లేరు అనడంలో అతిశయోక్తి లేదు. 

 

 

 అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ బయోపిక్ తెరకెక్కిస్తే ఆ బయోపిక్ కి  ఎవరు దర్శకత్వం వహిస్తారు... అన్నది ఒక పెద్ద ప్రశ్న అయితే అంతకంటే పెద్ద ప్రశ్న పవన్ కళ్యాణ్ పాత్రలో ఏ హీరో  నటిస్తాడు అన్నది . పవన్ కళ్యాణ్ పాత్రలో నటించడం అంటే ఆషామాషీ ఏమి కాదు. పవన్ కళ్యాణ్ కు ఒక ప్రత్యేక  మ్యానరిజం  ఉంటుంది. ఒక ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ ఉంటుంది. వాటన్నిటినీ మ్యాచ్ చేసే  హీరో  ఎవరు  అన్నది ప్రస్తుతం ప్రేక్షకులు ఊహించనిది. 

 

 

 అయితే ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది యువ హీరోలు ఉన్నప్పటికీ వీరి లో ఎవరూ  పవన్ కళ్యాణ్ బయోపిక్ లో బాగా సెట్ అవుతారు అని అని ఒక ప్రశ్న తెరమీదకి వస్తే  అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు సాయి ధరంతేజ్. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ పాత్రలో భాగా  సెట్ అవుతాడు అని మెగా అభిమానులు కొంత మంది అనుకుంటున్నారు. ఎందుకంటే సాయి ధరంతేజ్ చాలా సినిమాల్లో మామ పవన్ కల్యాణ్ ని ఇమిటేట్ చేస్తూ చాలా డైలాగులు చెప్పాడు. అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్ నటన ఆటిట్యూడ్ కూడా కొంచెం పవన్ కళ్యాణ్ ను పోలి ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ బయోపిక్ లో సాయి ధరంతేజ్ నటిస్తే బాగా సెట్ అవుతారని  మెగా అభిమానులు అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: