తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తూ ఉంటాయి. ఇలా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన కొన్ని సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో మైలు రాళ్ళుగా మారిపోయి సంచలనమే సృష్టిస్తూ ఉంటాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్లో ఎన్నో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ అటు తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటు చిరంజీవి కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన సినిమా ఠాగూర్. ఈ సినిమా అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
లంచగొండితనాన్ని అరికట్టడమే లక్ష్యంగా పని చేసిన చిరంజీవి... ఆ తర్వాత చిరంజీవి లంచం తీసుకునే వారిని గుర్తించడం... వారికి సంబంధించిన అన్ని వివరాలను సేకరించడం... ఆ తర్వాత అందరిని కిడ్నాప్ చేసి వారిని చంపడం... ఇలా లంచగొండితనాన్ని నిర్మూలించేందుకు చిరంజీవి చేసే ప్రతి ప్రయత్నం కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది అని చెప్పాలి. అంతే కాకుండా నువ్వు ఒక ముగ్గురికి సహాయం చేయి... ఆ ముగ్గురిని మరో ముగ్గురికి సహాయం చేయమని... ఆ ముగ్గురు మరో ముగ్గురికి సహాయం చేస్తే ఇలా అందరూ సహాయం పొందుతారు అని చిరంజీవి సినిమాలు చెప్పిన మాట అప్పట్లో తెలుగు ప్రజలను ప్రభావితం చేసింది.
ముఖ్యంగా అక్రమాలకు పాల్పడే రాజకీయ నాయకులను గుర్తించి... వారిని అంత మొందించడమే లక్ష్యంగా చిరంజీవి ఈ సినిమాలో పని చేస్తాడు. ఈ సినిమాలో ప్రతి అంశం కూడా తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త మెసేజ్ ని ఇచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా సంచలన విజయాన్ని కూడా నమోదు చేసింది. అంతేకాదు ఈ సినిమా ఎంతో మందిలో మార్పు కూడా తీసుకొచ్చింది అనే చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదలైన ఎన్నో రోజుల వరకూ చాలామంది లంచం తీసుకోవాలంటే భయపడ్డారు అని చెప్పాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులు అయితే వణికిపోయారు. ఇలా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా అటు సమాజాన్ని ఇటు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి