విలక్షణ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు 80 సంవత్సరాల వయస్సు దగ్గర పడుతున్నా సినిమాలు తీసే విషయంలో ఆయన ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు సరికదా ఇంకా వెరైటీ సినిమాలను తీయడానికి సింగీతం పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం బయోపిక్ ల హవా బాగా కొనసాగుతున్న పరిస్థితులలో సింగీతం ప్రస్తుతం బెంగుళూరు నాగరత్నం జీవితం పై ఒక బయోపిక్ తీయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.


స్వాతంత్రం రాకముందు కర్ణాటక రాష్ట్రంలో నాగరత్నం క్లాసికల్ సింగర్ గా సామాజిక చైతన్యం ఉన్న మహిళగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆనాటి మహిళ. అలనాటి దేవదాసి సాంప్రదాయం ప్రకారం అప్పటి మైసూర్ మహారాజా పోషణలో కొనసాగిన నాగరత్నం పాటలు వినడానికి అప్పట్లో లక్షలు సంఖ్యలో జనం వచ్చి వినేవారని ఆమె చరిత్ర తెలిసిన వారు చెపుతూ ఉంటారు.


ఎంతో చైతన్య స్ఫూర్తి కలిగిన ఆమె జీవితంలో అనేక ట్విస్ట్ లు ఉన్నాయి. ఈనాటితరం వారికి నాగరత్నం జీవితాన్ని పరిచయం చేయాలి అన్న ఉద్దేశ్యంతో సింగీతం ఆమె చరిత్ర గురించి పరిశోధన చేయించి ప్రముఖ డైలాగ్ రైటర్ బుర్రా సాయి మాధవ్ చేత ప్రస్తుతం డైలాగ్స్ వ్రాయిస్తున్నారు. మొదట్లో ఈ మూవీలో నాగరత్నం పాత్రను అనుష్క చేత నటింప చేయాలని చాల గట్టి ప్రయత్నాలు చేసారు.


అయితే అనుష్క తాను ఈ మూవీలో నటించలేను అని చెప్పడంతో ఇప్పుడు సంగీతం దృష్టిలో సమంత ఫైనల్ ఆప్క్షన్ గా మారింది అని అంటున్నారు. అంతేకాదు ఈ మూవీలో సమంతను నటింపచేయడానికి తన ఒత్తిడిని పెంచుతూ సింగీతం నాగార్జునతో తనకు ఉన్న పరిచయాల రీత్యా సమంత పై ఒత్తిడి పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సమంత మాత్రం తన నిర్ణయాన్ని చెప్పే విషయంలో ఇప్పటికే అనేకసార్లు వాయిదా వేస్తున్న పరిస్థితులలో మరొక హీరోయిన్ గురించి సింగీతం అన్వేషణ కొనసాగుతున్నా ఆయన ఆలోచనలు అన్నీ సమంత చుట్టూనే ఉన్నాయని టాక్..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: