బాలీవుడ్ బ్యూటీక్వీన్ కంగనా రనౌత్ ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. హీరోలు దర్శకనిర్మాతలు అనే తేడా లేకుండా అందరి పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది కంగనారనౌత్. ఇక అందరూ మాట్లాడడానికి భయపడే విషయాలను కూడా ఎంతో ధైర్యంగా తెరమీద చెబుతూ ఉంటుంది. కంగనా రనౌత్ ఇటీవలే పలువురు హీరోయిన్లు దర్శక నిర్మాతలపై ఓ ఇంటర్వ్యూలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇలా కంగనారనౌత్ విమర్శలు చేసిన వారిలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఉన్నారు.
ఇంతకీ ఈ ఇంటర్వ్యూలో దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై కంగనారనౌత్ ఎలాంటి విమర్శలు చేసింది అని అంటారా... అనురాగ్ కశ్యప్ ను మినీ మహేష్ భట్ అంటూ అభివర్ణించింది కంగనా రనౌత్. అయితే ఇది కాస్త చర్చనీయాంశంగా మారిపోయింది. తాజాగా దీనిపై స్పందించిన దర్శకుడు అనురాగ్ కశ్యప్.. ఒకప్పుడు తనకు కంగనారనౌత్ ఎంతో మంచి స్నేహితురాలు అంటూ గుర్తు చేసుకున్నారు. తాను కంగనారనౌత్ కి ఎన్నో సినిమా అవకాశాలు కూడా ఇప్పించాను అంటూ తెలిపాడు.
ప్రస్తుతం కంగనారనౌత్ పూర్తిగా మారిపోయిందని... తనకు మంచి స్నేహితులు అయిన తాప్సీ కంగనా మధ్య తలెత్తిన గొడవలను శాంతింప పరిచేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం మాత్రం దక్కలేదు అంటూ చెప్పుకొచ్చాడు అనురాగ్. అంతేకాకుండా వీరిద్దరి గొడవ సద్దుమణిగేందుకు కంగనా కు తాను చేసిన మెసేజ్లను సోషల్ మీడియాలో పెట్టి కంగనారనౌత్ ఎంతగానో రచ్చ చేసిందని.. కానీ ఒక మంచి స్నేహితుడు గానే కంగనా సమస్యలను పరిష్కరించాలని అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు అనురాగ్. తను అలా చేయడం కంగనాకు బాధ పెట్టి ఉంటే క్షమాపణలు చెప్పేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నాను అంటూ దర్శకుడు అనురాగ్ కశ్యప్ చెప్పుకొచ్చాడు. మరి దీనిపై కంగనారనౌత్ ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి