మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా పలు కమర్షియల్ హంగులతో పూరి తీసిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఒక్కసారిగా అంత గొప్ప విజయాన్ని అందుకున్న ఈ సినిమా అనంతరమే మహేష్ కు సూపర్ స్టార్ స్టేటస్ లభించింది. అయితే ఆ తరువాత మరొక్కసారి పూరి, మహేష్ ల కలయికలో వచ్చిన సినిమా బిజినెస్ మ్యాన్. మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంది. అయితే ఆ తరువాత నుండి ఇప్పటివరకు మరొక్కసారి వీరిద్దరి కాంబినేషన్లో లో సినిమా రాలేదు. కాగా పూరి డ్రీమ్ ప్రాజక్ట్ జనగణమణ లో మహేష్ హీరోగా నటిస్తున్నారు అంటూ ఇటీవల కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నప్పటికీ దానిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి, కొద్దిరోజుల క్రితం సూపర్ స్టార్ మహేష్ ని ప్రత్యేకంగా కలిసి మాట్లాడిన దర్శకడు పూరి, ఆయన కోసం ఒక అద్భుతమైన కథని సిద్ధం చేసే పనిలో నిమగ్నమయి ఉన్నారట. కాగా ఆ సినిమా వారిద్దరి కాంబోలో గతంలో వచ్చిన పోకిరి కి సీక్వెల్ అని అంటున్నారు. అలానే మహేష్ కూడా పోకిరి 2 చేయడనికి పూరి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే, ప్రస్తుతం తాను విజయ్ దేవరకొండతో తీస్తున్న ఫైటర్ అనంతరం ఈ సినిమా పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నాడట పూరి. మరోవైపు మహేష్ కూడా సర్కారు వారి పాట అనంతరం ఈ సినిమా చేద్దామని అనుకుంటున్నారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఏఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే ....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి