ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన యువ హీరో రాజ్ తరుణ్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మొదట తెలుగు ప్రేక్షకులు అందరిని ఆకర్షించిన యువ హీరో రాజ్ తరుణ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాడు. రాజ్ తరుణ్ నటనకు కామెడీకి ప్రేక్షకులందరూ బాగా ఆకర్షితులయ్యారు అనే చెప్పాలి. అయితే మొదట్లో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన సమయంలో వరుస విజయాలను అందుకున్న రాజ్ తరుణ్... ఆ తర్వాత మాత్రం ఎన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన  వరుస ప్లాపులతో సతమతం అయిన విషయం తెలిసిందే.



 దీంతో హిట్ కోసం ఎంతో పరితపించి పోయాడు. ఇక ఎన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా సరైన హిట్ మాత్రం కొట్టలేకపోయారు. ఇక ఇటీవలే ఒరేయ్ బుజ్జి గా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు రాజ్ తరుణ్. సినిమా థియేటర్లు తెరుచుకోకపోవడంతో ఈ సినిమాను ఓటిటి  వేదికగా విడుదల చేసిన విషయం తెలిసిందే.   నిర్మాత అల్లు అరవింద్ ఓటిటి  ప్లాట్ ఫామ్ ఆహా  లో ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది అనే విషయం తెలిసిందే.



 కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.  ఒరేయ్ బుజ్జిగా సినిమాకు సంబంధించి సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో తమ లక్ష్యం నెరవేరింది అంటూ రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు.  మంచి వినోదాత్మక సినిమాను ఇవ్వడం ద్వారా తమ లక్ష్యం నెరవేరిందని... ప్రస్తుత పరిస్థితుల్లో మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా చూడాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్. ఇక సినిమా థియేటర్లు తెరుచుకోకపోయినప్పటికి ఓటీటి  ద్వారా తమ సినిమా ప్రేక్షకులందరికీ చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: