ఇక ఈ మధ్య కాలంలో అమలాపాల్ ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ గా వచ్చిన ఆమె సినిమా పెద్ద సంచలనమే సృష్టించింది అనే విషయం తెలిసిందే. అమలాపాల్ మొట్టమొదటి సారిగా ఆమె సినిమాలో నగ్న పాత్రలో నటించడం సంచలన గా మారిపోయింది. అయితే కేవలం సినిమాల ద్వారా క్రేజ్ సంపాదించడమే కాదు ఎప్పుడూ పలు వివాదాల్లో కూడా నానుతునే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే మరో సారి ఓ కొత్త వివాదాన్ని తెరమీదకు తెచ్చి.. కోర్టు మెట్లు ఎక్కి పరువు నష్టం దావా డిమాండ్ చేసింది అమలాపాల్.
బాలీవుడ్ సింగర్ భువ్ నిందర్ సింగ్ తనను మోసం చేశాడంటూ అమలాపాల్ కేసు పెట్టింది. వృత్తిరీత్యా తీసిన ఫోటోలను భువ్ నిందర్ పెళ్లి జరిగినట్లుగా మార్చి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ని తప్పుబట్టిన అమలాపాల్... ఈ విషయంపై తనకు న్యాయం చేయాలి అంటూ చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. అతని పై పరువు నష్టం దావా వేసింది అమలాపాల్. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచేందుకు సిద్ధమయ్యారు. 2014లో అమలాపాల్ తమిళ దర్శకుడు విజయ్ ని పెళ్లి చేసుకుని ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడిపోయి ఆ తర్వాత బాలీవుడ్ సింగర్ భువ్ నిందర్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి