బుల్లితెర గ్లామర్ క్వీన్ ఎవరు అంటే ఎవరైనా వెంటనే అనసూయ పేరే చెపుతారు. దీనికితోడు ఆమె తరుచు షేర్ చేసే ఫోటో షూట్ లు కూడ అనసూయ పై నెగిటివ్ ఇమేజ్ రావడానికి సహకరిస్తున్నాయి. వాస్తవానికి అనసూయ చాల మంచినటి అన్న విషయం ఆమె నటించిన ఎన్నో సినిమా పాత్రలు తెలియచేసాయి.


ఈ పరిస్థితుల నేపధ్యంలో లేటెస్ట్ గా సిల్క్ స్మిత బయోపిక్ నుండి అనసూయ తప్పుకుంటున్నట్లు ఆమె స్వయంగా చేసిన అధికారిక ప్రకటన వెనుక అనేక విషయాలు ఆమె నిర్ణయాన్ని ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి అనసూయ సిల్క్ స్మిత బయోపిక్ లో నటిస్తున్నట్లు వార్తలు రావడానికి అనసూయ అత్యుత్సాహమే కారణం అన్న కామెంట్స్ వస్తున్నాయి.


‘ఒక మంచి కథ ఒక కొత్త ఆరంభం కోలీవుడ్’ అనే క్యాప్క్షన్ తో అద్దంలో తన మొఖాన్ని చూసుకుంటున్న ఫోటోను షేర్ చేసి అనసూయ ఆమె ఫోటోకు సిల్క్ స్మిత ఫోటోను ట్యాగ్ చేసింది. దీనితో ఆమె సిల్క్ స్మిత బయోపిక్ లో నటిస్తోంది అంటూ విపరీతమైన ప్రచారం జరిగింది.


ప్రస్తుతం బయోపిక్ ల సీజన్ నడుస్తున్న నేపధ్యంలో అనసూయ ఈ మూవీని చేయడానికి అంగీకరించి ఉంటుంది అని చాలామంది భావించారు. అయితే తెలుగు తమిళ భాషలలో నిర్మించబోతున్న ఈ బయోపిక్ స్క్రిప్ట్ లో సిల్క్ స్మిత జీవితానికి సంబంధించిన చాల వివాదాస్పద విషయాలు అని తెలిస్తోంది. ఇప్పటికే విద్యాబాలన్ సిల్క్ స్మిత జీవితం పై తీసిన ‘డర్టీ హీరోయిన్’ సినిమా విజవంతమైన పరిస్థితులలో మళ్ళీ అదే సిల్క్ స్మిత జీవితం పై నిర్మిస్తున్న మూవీలో నటించి మరొకసారి వివాదాలలోకి రావడం అనవసరం అని ఆమె సన్నిహితులు ఇచ్చిన సలహాలతో ఆమె ఈ బయోపిక్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే మరికొందరు ఈ విషయం పై మరొక విధంగా స్పందిస్తున్నారు. ఈ మూవీ నిర్మాతకు అనసూయకు మధ్య వచ్చిన పారితోషిక వివాదాలతో ఈమూవీ ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: