కమల్ హాసన్ కుమార్తె గా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన శృతి హాసన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్ అనేంతగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది.ఇటీవలే ఆమె నటించిన క్రాక్ సినిమా సూపర్ హిట్ కావడం తో శృతి హసన్ కి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ సినిమా హిట్ తో హీరోకి, డైరెక్టర్ ఎంతవరకు కలిసి వచ్చిందో కానీ హీరోయిన్ శృతి హసన్ కి మాత్రం మంచి పేరుతో అవకాశాలు కూడా వస్తున్నాయి.. ఈ సినిమా ముందువరకు శృతి హాసన్ కెరీర్ ఆల్మోస్ట్ అయిపోయిందనుకున్నారు అంతా.. చేతిలో సినిమాలు కూడా ఏవీ లేవు..

తెలుగు తో పాటు బాలీవుడ్, తమిళ సినిమా చేసే శృతి హాసన్ కు ఇతరభాషల్లోనూ సినిమాలు లేకపోవడంతో ఆమెకు కెరీర్ అయిపోయిందనుకున్నారు.. అయితే క్రాక్ సినిమా చేయడం ఆమె కెరీర్ కు ఓ మలుపు లాంటిది అని చెప్పొచ్చు.. ఈ సంక్రాంతి కి రిలీజ్ అయిన క్రాక్ సినిమా సూపర్ హిట్ అయ్యింది..అయితే 35వ బర్త్‌డేను జరుపుకొంటున్న శృతి తాజాగా కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో ముంబై వీధుల్లో చెట్టాపట్టాలేసుకొని మీడియాకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. లండన్‌కు చెందిన మైఖేల్ కోర్సలేతో శృతి హాసన్ పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారు. దాదాపు పెళ్లి చేసుకొని కాపురం చేసినంత పని చేశారు.

నవ దంపతుల మాదిరిగా చెన్నైలో జరిగిన ఓ పెళ్లికి హాజరయ్యారు. వారిద్దరి వివాహం పక్కా అని అనుకొనే క్రమంలో వారి మధ్య అభిప్రాయ బేధాలు రావడం, అవి పరిష్కరించుకొనే వీలు లేకపోవడంతో 2019లో విడిపోయారు. మైఖేల్‌ కోర్సలేతో విడిపోయిన తర్వాత శృతి ఒంటరిగానే ఉంటూ వచ్చారు.తాజాగా ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తూ ముంబైలో పలు రెస్టారెంట్లలో మీడియా కంటపడినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలకు బలం చేకూరేలా జనవరి 27వ తేదీన బాయ్‌ఫ్రెండ్‌తో నడి రోడ్డు మీద చేతిలో చేయి వేసుకొని డేటింగ్ చేస్తూ కనిపించడం మీడియా కెమెరాలకు చిక్కింది. గతంలో అదే వ్యక్తితో పలుమార్లు కనిపించినట్టు సోషల్ మీడియాలో ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: