బాలీవుడ్లో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రగ్యా జైస్వాల్
చేసి ఆ తర్వాత టాలీవుడ్ లోకి కంచే  సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించింది అన్న విషయం తెలిసిందే. తన అభినయంతో తెలుగు ప్రేక్షకుల అందరిని ఒక్క సినిమాతోనే ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. అయితే కంచె సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఇక ఈ సినిమాలో ఓ వైవిధ్యమైన పాత్రలో నటించినప్పటికి కూడా ఈ అమ్మడికి టాలీవుడ్ లో సరైన బ్రేక్ రాలేదు అని చెప్పడం అతిశయోక్తి లేదు. ఇక మరికొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు సంపాదించుకోలేక పోయింది ఈ హాట్ బ్యూటీ.


 అయినప్పటికీ ఎక్కడా నిరుత్సాహ పడకుండా ఇప్పటికి తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజ్ సంపాదించుకోవడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తూనే ఉంది.  అదే ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది అన్న టాక్ వినిపిస్తోంది. మరోసారి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ అక్కడ సత్తా చాటేందుకు ప్రగ్యా జైస్వాల్ సిద్ధమైంది. అది కూడా ఏ చిన్న హీరో సరసన అనుకుంటే మాత్రం పొరబాటే.. ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా కనిపించనుందని ప్రస్తుతం బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.


 బాలీవుడ్ ను వదిలి టాలీవుడ్ ని నమ్ముకున్న ప్రగ్యా జైస్వాల్ కు సరైన హిట్ లు మాత్రం ఇప్పటివరకు దక్కలేదు. అయినప్పటికీ వరుసగా ఆఫర్లు మాత్రం దక్కించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు మరోసారి బాలీవుడ్ లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన నటించేందుకు అవకాశం వచ్చిన నేపథ్యంలో ఇక ఈ సినిమా ప్రగ్యా జైస్వాల్ కు మంచి బ్రేక్ ఇవ్వబోతోంది అని అభిమానులు నమ్ముతున్నారు. అయితే ఇక సల్మాన్ ఖాన్ సినిమాలో  ప్రగ్యా జైస్వాల్ పాత్రకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రస్తుతం బాలీవుడ్ టౌన్ లో టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: