గత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గీతాఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అలవైకుంఠపురములో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్. తమన్ మ్యూజిక్ అందించిన ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో నటించింది.

ఇక దాని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని టాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పలు కమర్షియల్ అంశాల కలబోతగా మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నట్లు టాక్.సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయింది. కాగా ఈ సినిమాని ఈ ఏడాది స్వతంత్ర దినోత్సవం కానుకగా ఆగష్టు 13 రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ కొన్నాళ్ల క్రితం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

నిజానికి ఈ సినిమాలో హీరో హీరోయిన్ల పాత్రలతో పాటు మరి కొన్ని పాత్రలు ఆడియన్స్ ని ఎంతో అలరిస్తాయని మరీ ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ కూడా ఎంతో అదిరిపోతుందని చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీలో అసలు హీరో కథే నని, కాగా ఒక కీలక పాయింట్ చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుందని తప్పకుండా రిలీజ్ తర్వాత ఈ మూవీ భారీ సక్సెస్ ని అందుకుని అల్లు అర్జున్ ఖాతాలో మరొక సూపర్ హిట్ నమోదు చేయడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ఉగాది కానుకగా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: