కమెడియన్ వేణుమాధవ్ కు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డితో వేణుమాధవ్ పెద్ద గేమ్ ఆడాడు అంటే ఎవరు నమ్మరు. అంతేకాదు కృష్ణారెడ్డి ఏరికోరి వేణుమాధవ్ ను ‘సాంప్రదాయం’ సినిమాలో బుక్ చేస్తే ఆ సినిమా నుంచి తప్పించుకుందామని వేణుమాధవ్ చాల రకాల ప్రయత్నాలు చేసాడు అంటే ఎవ్వరూ నమ్మలేని నిజం. కానీ ఇది యదార్ధంగా జరిగింది. ఈ విషయాలను స్వయంగా వేణుమాధవ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించాడు.
1995లో రవీంద్రభారతిలో రచయిత దివాకర్‌బాబుకు సన్మానం జరిగినప్పుడు ఆ కార్యక్రమంలో వేణుమాధవ్ మిమిక్రీ చేసాడట. ఆ కార్యక్రమాన్ని చూసిన కృష్ణారెడ్డి వేణుమాధవ్ వద్దకు వచ్చి ఒకసారి తనను ఆఫీసులో కలవమని అడిగితే తన మిమిక్రీ ప్రోగ్రామ్ గురించి అనుకున్నాడట. అయితే తీరా అక్కడకు వెళ్ళే సరికి సూపర్ స్టార్ కృష్ణ తో తాను తీస్తున్న ‘సాంప్రదాయం’ సినిమాలో ఒక పాత్ర ఉంది చేస్తావా అని అడిగితే తన మీద అంత పెద్ద దర్శకుడు ఎందుకు సెటైర్లు వేస్తున్నాడో అర్ధంకాక ఆలోచించి చెపుతాను అన్నాడట వేణుమాధవ్.
ఆ తరువాత ఎంత ఆలోచించినా తాను సినిమాలకు పనికిరాను అని అనిపించడంతో ఎదో విధంగా కృష్ణారెడ్డి ఆఫర్ ను తిప్పి కొట్టడానికి తనకు మిమిక్రీ ప్రోగ్రాములు చేయడం వల్ల రోజుకి 1000 రూపాయలు ఆదాయం వస్తుందని అందువల్ల వాటిని కాదనుకుని కృష్ణారెడ్డి సినిమాలో 70 రోజులు షూటింగ్ లో ఉండిపోతే తనకు 70 వేలు నష్టం వస్తుందని నెమ్మదిగా కృష్ణారెడ్డికి చెప్పి ఆ మొదటి సినిమా చాన్స్ దెబ్బతో వదిలి పోయింది అని ఆనంద పడ్డాట వేణుమాధవ్.
కాని వాస్తవానికి ఆ రోజులలో వేణుమాధవ్ కు మిమిక్రీ ప్రోగ్రామ్స్ వల్ల రోజుకు 150 రూపాయలు మాత్రమే వచ్చేదట. కేవలం సినిమాలంటే భయంతో అలా తప్పించు కోవాలను కున్నాడట.అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా కృష్ణారెడ్డి మరునాడు వేణుమాధవ్ ఇంటికి ఒక మనిషిని పంపించి 10 వేలు అడ్వాన్స్ ఇచ్చి మిగతా డబ్బు సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక ఇస్తాను అనేసరికి ఏమి చెప్పాలో తెలియక అయిష్టంగానే సినిమాలలోకి వచ్చి ఈరోజు టాప్ కమెడియన్ గా అదృష్టం కొద్ది మారిపోయాను అని అంటున్నాడు వేణుమాధవ్..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి