17 ఏళ్ళ వయసులో కాకినాడ నుండి వచ్చిన యాంకర్ శ్యామల మొదట కెమెరా జీవితాన్ని సీరియల్స్ తోనే మొదలు పెట్టింది. అలా నెమ్మది నెమ్మదిగా అవకాశాలు పెంచుకుంటూ మా వూరి వంట, పట్టుకుంటే పట్టుచీర వంటి షోలతో యాంకర్ గా మారి తన టాలెంట్ తో దూసుకుపోతోంది. నాటి నుండి నేటి వరకు అదే క్రేజ్ ని మెయింటైన్ చేస్తూ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉంది శ్యామల. ప్రస్తుతం రష్మీ, అనసూయ, శ్రీముఖి, వర్షిని వంటి యంగ్ యాంకర్లు పోటీకి వచ్చి నిలబడ్డా నా ప్లేస్ ఎప్పుడూ నాదే అన్నట్టుగా అటు సినిమాలలో నటి గానూ, ఇటు పలు షోలకు యాంకర్ గా, ఆడియో ఫంక్షన్లలో హోస్ట్ గా సందడి చేస్తూ సత్తా చాటుతోంది.

అయితే వివాదాలకు కాస్త దూరంగా ఉండే ఈ అమ్మడు, తన భర్త నరసింహా చీటింగ్ కేసుతో ఈమధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. శ్యామల భర్త ఓ మహిళను చీటింగ్ చేశాడు అంటూ పలు వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో నరసింహ అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటకు వచ్చి తనకి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని, ఇది నిరూపించి తీరుతా అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా శ్యామల గురించిన మరో న్యూస్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. తనపై వస్తున్న కథనాల గురించి స్పందించిన యాంకర్ శ్యామల తనదైన శైలిలో తిప్పికొట్టింది.

ఇండియన్ క్రికెటర్ మరియు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ యాంకర్ శ్యామలకు తమ్ముడు వరుస అవుతాడని సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన యాంకర్ శ్యామల, అవునా క్రికెటర్ భువనేశ్వర్ నా బ్రదర్ అన్న విషయం నాకే తెలియదు. వాళ్లకు ఎలా తెలుస్తుంది అంటూ కౌంటర్ ఇచ్చింది. విస్తృతంగా ప్రచారమవుతున్న ఈ గాసిప్ లో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చేసింది. ఇలాంటి వార్తలను వైరల్ చేసే ముందు నిజా నిజాలేంటో తెలుసుకుంటే మంచిదని ఘాటుగా సమాధానమిచ్చింది. దీనితో ఈ భువనేశ్వర్ శ్యామల సంబంధానికి తెరపడినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: