సినిమా పరిశ్రమను ఒకప్పుడు ఏలిన హీరోయిన్ మాధురి దీక్షిత్ ఇప్పటికీ అదే తరగని అందంతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తుంది. అప్పుడప్పుడు కొన్ని ఫోటో షూట్స్ తో అభిమానులను మైమరిపిస్తూ యాభై లలో కూడా ఆమె అందరిని అలరిస్తుంది.. ఆమెనటనకు, అందానికి ఫిదా అయిపోయే చాలామంది ఫ్యాన్స్ లో ఇప్పటితరం వారు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు.. అంతలా ఆమె సినిమాలపై ఆమె ఎఫెక్ట్ ఉంది..

1984లో మాధురి దీక్షిత్ అబొద్ అనే సినిమాతో అరంగేట్రం చేయగా కొన్ని సినిమాల్లో సహాయ నటిగా కూడా చేసి తేజాబ్ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు.. ఈ పాత్ర కు గాను ఆత్మకు ఫిలింఫేర్ నామినేషన్ కూడా తెచ్చి పెట్టింది.. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.. 1990లో అమీర్ ఖాన్ దిల్ అనే ప్రేమ కథ చిత్రం లో నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు.. మాధురి దీక్షిత్ కి డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తి .. మూడు సంవత్సరాల వయస్సు నుంచి ఆమె నాట్యం నేర్చుకోవడం ప్రారంభించింది..

 పళ్ళున్న చెట్టుకే రాళ్ళు అన్నట్లు ఆమె మంచి స్వింగ్ లవ్ ఉన్న సమయంలో ఆమెకు ఎఫైర్లు అంటగట్టారు.. ఆ తర్వాత ఆమె యూఎస్ కు చెందిన ఒక డాక్టర్ ని వివాహం చేసుకున్నారు.. క్యాలిఫోర్నియా లో ఆమె పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.. ఆమెకు ఇద్దరు కుమారులు ఆరిన్ నేనే, ర్యాన్ నేనే.. ఈ రోజు ఆమె పుట్టిన రోజు కాగా ఆమె సినిమా ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయికి వచ్చారాని చెప్పొచ్చు.. సగటు ప్రేక్షకుడిలా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఆమె ఎండలో రాళ్ల పై కూర్చుని ఎన్నో కష్టాలు పడుతూ ఒక అవకాశం ఇవ్వండి అంటూ సినిమా దర్శకులను వేడుకుంది.. ఆమె కష్టమే ఆమెకు ఈ స్టార్ స్టేటస్ తెచ్చి పెట్టింది అని చెప్పొచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: