తెలుగు సినిమా చరిత్రలో వేటూరి సుందరరామూర్తి తన పాటలతో చెరగని ముద్ర వేసుకున్నారు. దైతా గోపాలం, మల్లాది ల వద్ద శిష్యరికం చేసిన వేటూరి ఆ తర్వాత కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీతకథ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరవాత కొన్ని వేల పాటలను రాసి రికార్డులు క్రియేట్ చేశారు. తెలుగు పాటలకు శ్రీశ్రీ తరవాత మళ్ళీ అంతటి ఖ్యాతిని తీసుకువచ్చిన రచయిత కూడా వేరూరి నే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందమైన పాటలను అలవోకగా రచించడంలో వేటూరి అసాధ్యుడు అనిపించుకున్నారు. సూపర్ హిట్ సినిమాలైన శంకరాభరణం, అడవిరాముడు, సాగరసంగమం, సప్తపది, ముద్ద మందారం, సితార, స్వాతి ముత్యం , అన్వేషణ లాంటి సినిమాలకు పాటలు రాశారు. కేవలం ఒకే రకానికి చెందిన పాటలు కాకుండా చాలా రకాల పాటలను రాసి వేటూరి గొప్ప రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు .

సాంప్రదాయ కవిత్వం నుండి జానపద గేయాలవరకు అన్ని రకాల పాటలతోనూ వేటూరి ఆకట్టుకున్నారు. మాతృదేవోభవ సినిమాలో వేటూరి రాసిన "రాలిపోయె పువ్వానీకు రాగాలేందుకే" పాటకు 1994 సంవత్సరం లో అవార్డు వచ్చింది. ఇదే తెలుగు పాటకు రెండవసారి జాతీయ అవార్డు రావడం. కాగా తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా ఇవ్వలేదన్న కారణంతో వేటూరి తన అవార్డును తిరిగిచ్చి మాతృ భాష పై తనకున్న అభిమానం, ప్రేమను చాటిచెప్పారు. 1936లో కృష్ణా జిల్లాలో జన్మించిన వేటూరి 2010 మే22న మరణించారు. ఈరోజు వేటూరి వర్దంది సందర్భంగా ఆయన రాసిన కొన్ని సూపర్ హిట్ పాటలను ఇప్పుడు చూద్దాం...పదహారేళ్ళ వయసు సినిమాలోని "సిరిమల్లె పూవా సినిమల్లే పూవా", సీతా మహాలక్షి సినిమాలోని "సీతాలు సింగారం", అనురాగ దేవత చిత్రంలో "చూసుకో పదిలంగా" తో పాటు మరి కొన్ని సూపర్ హిట్ పాటలను రాసారు .

మరింత సమాచారం తెలుసుకోండి: