తెలుగు సినిమా పరిశ్రమలో అతిలోక సుందరిగా ప్రఖ్యాతి గాంచిన దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగులో నటించనుంది అన్న విషయం గత కొంత కాలంగా ట్రెండింగ్ లో ఉంది. అయితే ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం లేదు. కొన్ని రోజులు జాన్వీ కపూర్ తన మొదటి సినిమా మహేష్ బాబుతో చేయనుందని కొన్ని సైట్స్, కాదు జూనియర్ ఎన్టీఆర్ తోనే తెలుగులో అరంగేట్రం చేయనుందని మరి కొన్ని సైట్స్ వార్తలు రాసుకొస్తున్నాయి. కానీ వాస్తవం మాత్రం ఇంకా తేటతెల్లం కాలేదు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ 31 వ చిత్రంలో నటించబోతున్నట్లు పుకార్లు వస్తున్నాయి.

సినిమా కూడా ప్రముఖ పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ కాంబినేషన్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ కోసం ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ని నటింపచేయడానికి మొదటిగా బోణీ కపూర్ ను సంప్రదించినట్లు సమాచారం. ఆయన ద్వారా జాన్వీ కపూర్ ను ఒప్పించే ప్రయత్నం జరుగుతున్నట్లు వినికిడి.

ఇక్కడ ముంబై మీడియా వారి సమాచారం ప్రకారం జాన్వీ కపూర్ తెలుగులో సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలోనే అని బలంగా వినిపిస్తోన్న వాదన, ఎందుకంటే ఈ మధ్యన జాన్వీ కపూర్ ను కలవడానికి వెళ్ళింది మైత్రి మూవీ మేకర్స్ మాత్రమే. కాబట్టి ఎన్టీఆర్ అభిమానాలు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు సినిమా పరిశ్రమలో శ్రీదేవిలాగా చక్రాన్ని తిప్పబోతోంది అని సినిమా వర్గాలు అనుకుంటున్నారు. ఈమె అంగీకారంతో మూతి మూవీ మేకర్స్ జాన్వీన్ కపూర్ ను ఒప్పించడంలో సక్సెస్ అయిందని తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివారాలు తెలియాలంటే మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడక తప్పదు.



మరింత సమాచారం తెలుసుకోండి: