అయితే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్శించింది మాత్రం "దృశ్యం" సినిమాతో, మోహన్ లాల్ మరియు మీనా ప్రధానపాత్రల్లో నటించారు. ఇదే సినిమాను తరువాత తెలుగు, తమిళ్ లో కూడా రీమేక్ చేశారు. అవి కూడా మంచి విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం దృశ్యం సీక్వెల్ మూవీ తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే జీతూ జోసెఫ్ కి తెలుగులో మరో సినిమా అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది. దృశ్యం తెలుగు రీమేక్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన సురేష్ ప్రొడక్షన్ అధినేత సురేష్ బాబు జీతూ జోసెఫ్ డైరెక్షన్ శైలి నచ్చి మరో అవకాశం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కథను సిద్ధం చేయమని జోసెఫ్ కి చెప్పారని సమాచారం. దీనికి జోసెఫ్ కూడా అంగీకరించారని భోగట్టా.
అయితే ఈ కథ ఎవరికోసం అనేది ఇంకా తెలియలేదు. ఇప్పటికే వెంకటేష్ దృశ్యం , దృశ్యం 2 రెండు సినిమాలను చేయగా, మూడో సారి అతనితో చేస్తారా ? లేదా రానా ఇందులో నటిస్తారా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధిచిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి