టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ ల కాంబినేషన్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబోలో వచ్చింది ఒక సినిమానే అయినా..అది టాలీవుడ్ రికార్డ్స్ ని బద్దలు కొట్టింది.2012 లో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'గబ్బర్ సింగ్' సినిమా పవన్ కళ్యాణ్ క్రేజ్ ని ఆకాశానికి తాకేలా చేసింది. ఈ సినిమాతో పవన్ కి లైఫ్ ఇచ్చాడు హరీష్ శంకర్.దీంతో వీరి కాంబినేషన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక మరోసారి ఈ కాంబోలో మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.ఇక వారి ఆశలను నెరవేరుస్తూ.. మళ్ళీ ఈ ఇద్దరూ కలిసి తాజాగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్ కెరీర్లో 28 వ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు హరీష్.

ఇప్పటికే స్క్రిప్ట్ ని కూడా పూర్తి చేశాడట ఈ దర్శకుడు.ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ని మరో రేంజ్ లో చూపించబోతున్నట్లుగా ఇప్పటికే ఫ్యాన్స్ కి హామీ ఇచ్చాడు హరీష్.ఈ నేపథ్యంలో తాజాగా తన ట్విట్టర్ లో పవన్ కి సంబంధించి ఓ వీడియోను పోస్ట్ చేసాడు.."లెట్స్ విట్నెస్ థిస్ ఎనర్జీ అగైన్" అనే క్యాప్షన్ ని పెడుతూ... బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ ల మధ్య వచ్చే ఎనర్జిటిక్ సీన్స్ ని ఓ వీడియో రూపంలో పొందిపర్చాడు.ఇక హరీష్ శంకర్ పోస్ట్ చేసిన ఈ వీడియోకు ట్విట్టర్ వేదికగా భారీ రెస్పాన్స్ వస్తోంది.ఇప్పటికే ఈ వీడియోకి సుమారు ఆరు వేల రీ ట్వీట్లు వచ్చాయి.

ప్రస్తుతం ఈ వీడియో ఇండియా వైడ్ గా ఎంతో వైరల్ అవుతుంది.అంటే సినిమాలో పవన్ ను తన సినిమాలో ఎంత ఎనర్జీటిక్ గా చూపించబోతునన్నాడో ఇలా ఓ శాంపిల్ రూపంలో తెలియజేశాడు హరీష్ శంకర్. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై మళ్లీ అంచనాలు పెరిగిపోతున్నాయి.ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. క్రిష్ తెరేకెక్కిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఓ షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసుకుంది.దీంతో పాటూ అయ్యప్పనున్ కోషియం రీమేక్ లో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తి అయ్యాక.. హరీష్ సినిమాకి డేట్స్ కేటాయించనున్నాడట పవన్ కళ్యాణ్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: