రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా చెప్పవచ్చు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ సినిమా. 2019 లో వచ్చిన సినిమాలకంటే ఈ సినిమానే సూపర్ హిట్ గా నిలిచింది.  నిధి అగర్వాల్ , నభ నటేష్ లు హీరోయిన్స్ గా నటించగా సత్యదేవ్ కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అయితే ఈ సినిమా కి ముందు రామ్ కు పెద్దగా హిట్లు లేవు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దాంతో ఏ దర్శకుడుతో అయితే తనకు హిట్ వస్తుందో అని ఆలోచించిన సరైన ఎంపిక గా పూరి జగన్నాథ్ ను సెలక్ట్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ తో చేతులు కలిపి ఆయన ఇష్మార్ట్ శంకర్ ప్రయోగం చేశాడు. అయితే ఈ సినిమా అనుకున్నట్టుగానే హిట్ సాధించడంతో ఊపిరి పీల్చుకున్నాడు రామ్.  దీనికి ముందు రామ్ హలో గురు ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ, హైపర్ వంటి భారీ ఫ్లాప్ చిత్రాలను ఎదుర్కొన్నాడు. ఇస్మార్ట్ శంకర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ చిత్రం ఆయన ఆశలను నెరవేర్చింది. ఈ సినిమా యూత్ ను ఆకర్షించడంలో సక్సెస్ అయ్యింది.

పూరి జగన్నాథ్ , చార్మి కౌర్ లు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 85 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే పూరి జగన్నాథ్ కంటే ఈ సినిమా రామ్ కు హీరోగా నిలదొక్కుకోవడానికి ఎంతో బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఆయనను పూర్తిగా క్లాస్ నుంచి మాస్ హీరోగా మార్చి వేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. తనదైన డబుల్ ధమాకా యాక్షన్ తో రామ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. తొలిసారి టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తో చేతులు కలిపిన రామ్ తన నిర్ణయం సరైనది అని ఇస్మార్ట్ శంకర్ సినిమా నిరూపించింది. ఇక నుంచి ఆయన నుంచి ఎలాంటి మాస్ చిత్రాలు రాబోతున్నాయి చూద్దాం.
 

మరింత సమాచారం తెలుసుకోండి: