కామెడీ చిత్రాలు మనకున్న బాధలన్నీ మర్చిపోయేలా చేస్తాయి. రోజువారీ పనులతో, ఒత్తిళ్లలో చితికి పోతున్న ప్రజలకు కామెడీ చిత్రాలు ఎంతో రిలీఫ్ ఇస్తాయి. అయితే మన తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీ చిత్రాలకు  కొదవలేదు. రేలంగి, అంజి, పద్మనాభం, అల్లు రామలింగయ్య, బాబు మోహన్ నుంచి వెన్నెల కిషోర్ వరకూ ఎందరో కమెడియన్లు తెలుగు సినీ అభిమానులను ఎంతగానో నవ్వించారు.. ఇప్పటికీ నవ్విస్తూనే ఉన్నారు. అనగా వారు గతంలో చేసిన సినిమాలు ఇప్పటి ప్రేక్షకులను కూడా కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ముఖ్యంగా హాస్యబ్రహ్మ జంధ్యాల రూపొందించిన సినిమాలు ఎవర్‌గ్రీన్ కామెడీ హిట్స్ గా నిలుస్తున్నాయి. ఐతే ఆయన డైరెక్ట్ చేసిన 5 బెస్ట్ కామెడీ చిత్రాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

1. అహ నా పెళ్ళంట:
జంధ్యాల రూపొందించిన అన్ని సినిమాల్లోకెల్లా "అహ నా పెళ్ళంట" ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది. ఈ సినిమా ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు ఎన్నో కామెడీ సీన్లు ఉంటాయి. పిసినారి తనం నుంచి కూడా కామెడీ జనరేట్ చేయొచ్చని ఈ చిత్రంతో జంధ్యాల నిరూపించారు. రూ.16 లక్షల రూపాయలతో రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 5 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమాలోని లక్ష్మీపతి పాత్రలో కోట శ్రీనివాసరావు, అరగుండు గోవింద్ పాత్రలో బ్రహ్మానందం చక్కగా నటించి కడుపుబ్బా నవ్వించారు. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కామెడీ చిత్రాల్లో అహ నా పెళ్ళంట టాప్ ప్లేస్ లో ఉంటుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

2. బాబాయ్ అబ్బాయ్:
సుత్తి వీరభద్ర రావు, నందమూరి బాలకృష్ణ, సుత్తి వేలు కలసి నటించిన "బాబాయ్ అబ్బాయ్" చిత్రం కూడా హాస్యాస్పదంగా ఉంటుంది. ఆద్యంతం ఆసక్తికరంగా, హాస్యాస్పదంగా కొనసాగే "బాబాయ్ అబ్బాయ్" జంధ్యాల సినిమాల్లో బెస్ట్ కామెడీ సినిమాగా నిలుస్తుంది.

3. శ్రీవారికి ప్రేమలేఖ:

జంధ్యాల డైరెక్ట్ చేసిన సినిమాల్లో రొమాంటిక్ కామెడీ డ్రామా "శ్రీవారికి ప్రేమలేఖ" అత్యంత ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. పొట్టచెక్కలయ్యేలా నవ్వించే ఈ సినిమా బెస్ట్ తెలుగు కామెడీ మూవీస్ లో ఒకటిగా నిలుస్తుంది. నరేష్, పూర్ణిమ, సుత్తి వీరభద్ర రావు, నూతన ప్రసాద్ నటించిన ఈ చిత్రానికి ఒక నంది అవార్డుతో పాటు ఒక ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. రొమాంటిక్ కామెడీ సినిమాలు ఇష్టపడేవారు ఈ సినిమాని అస్సలు మిస్ కాకండి.

4. హై హై నాయకా:
హై హై నాయకా చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన వారందరూ హాస్యనటులే కావడంతో ఈ సినిమాపై అప్పట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా అంచనాలకు మించి ప్రేక్షకులను అలరించింది. జంధ్యాల ఈ సినిమాలో ఒక చిన్న కుర్రాడు తన ఉపాధ్యాయులను పచ్చి బూతులు, బండ బూతులు తిడితే ఎలా ఉంటుందో చాలా ఫన్నీ గా చూపించారు. తర్వాత ఆ కుర్రాడిని హీరో ఎలా మారుస్తారో కూడా చాలా చక్కగా చూపించి అందరి మనసులను గెలుచుకున్నారు. ఈ సినిమాలోని ఫస్టాఫ్ హిలేరియస్ అని చెప్పుకోవచ్చు.

5. వివాహ భోజనంబు:
జంధ్యాల దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన వివాహ భోజనంబు చిత్రం కూడా బాగా నవ్విస్తుంది. ఆసక్తికరమైన స్టోరీ లైన్ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా కూడా జంధ్యాల కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: