
గత పది సంవత్సరాలుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆలరిస్తున్న షో జబర్దస్త్. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, రాకెట్ రాఘవ వంటి కమెడీయన్స్ కొన్ని సంవత్సరాలుగా ఈ షో ను ముందుకు తీసుకు వెళుతూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు. గతంలో చాలా సార్లు ఈ సో ఆగిపోతుంది పూర్తవుతుంది అంటూ చాలా వార్తలు వచ్చినా కూడా వాటన్నిటినీ అధిగమించి సక్సెస్ ఫుల్ గా దశాబ్దకాలంగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వచ్చింది.
మధ్యలో ఎన్నో ఘటనలు జరిగిన జబర్దస్త్ షో మాత్రం నిర్విరామం గా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ షోపై మరొక వివాదం వచ్చింది. అదేమిటంటే హీరో సూపర్ స్టార్ కృష్ణ ను అవమానించేలా జబర్దస్త్ టీమ్ సభ్యులు సుడిగాలి సుధీర్ చేసిన స్కిట్ ఉందని సూపర్ స్టార్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ శుక్రవారం రోజున ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ స్కిట్ కోసం నీతో సాయంత్రం ఎంతో సంతోషం అనే పాట పేరడీ చేసారు. ఈ పాట సూపర్ స్టార్ కృష్ణ ది కాగా ఈ పేరడీ లో సూపర్ స్టార్ కృష్ణ ఇమేజ్ కు ఇబ్బంది కరమైన రీతిలో సుధీర్ టీం ప్రవర్తించిందని కృష్ణ అభిమానులు వీరి పై ఆగ్రహంగా ఉన్నారు.
జబర్దస్త్ షో అంటే ఒకప్పుడు ఆహ్లాదకరమైన అభినందనీయమైన కామెడీ వచ్చేది అని ప్రేక్షకుల అభిప్రాయం కానీ గత కొన్ని రోజులుగా డబల్ మీనింగ్ డైలాగులు, పోలికలు, అపహస్యలు, విమర్శించడాలు తప్పా ఏవీ ఉండట్లేదు. స్టార్ హీరోలను సైతం వీరు ఇమిటేట్ చేస్తూ వారి అభిమానులకు కోపం తెప్పిస్తున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ఇదిలా ఉంటే జబర్దస్త్ షో ద్వారా టాలీవుడ్ కి కమెడియన్ ల రాక ఎక్కువ అయింది అని చెప్పాలి. సినిమాల్లో అవకాశాల మాట అటుంచితే బుల్లితెరపై వీరికి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. కొంతమందికి వెండితెర అవకాశాలు కూడా వస్తున్నాయి. సినిమాలలో కామెడీ మిస్ అయిన వారికి జబర్దస్త్ షో లో కామెడీ ఒకరకంగా ఎంతగానో నచ్చుతుంది.