ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ ప్రారంభించి ఇక లక్షల మంది ప్రాణాలను నిలబెట్టడంలో మెగాస్టార్ కృషి మాటల్లో వర్ణించలేం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక కొన్నాళ్లపాటు రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా మెగాస్టార్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో సాధారణంగా ఖాళీగా ఉండరు. కానీ ఒకవేళ మెగాస్టార్ కాస్త ఖాళీ సమయం దొరికితే ఏం చేస్తారు అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఇక ఈ విషయాన్ని ఇటీవలే రాజారవీంద్ర ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చదువు చెప్పిన కాలేజీ ఏమీ నేర్పించలేదు.. కానీ పదేళ్లపాటు మెగాస్టార్ తో అనుబంధం తనకు అన్ని నేర్పించింది అంటూ రాజారవీంద్ర చెప్పుకొచ్చారు. సాధారణంగా చిరంజీవి ప్రతి పనిలో పర్ఫెక్షన్ కూడా చూపిస్తారు అంటూ చెప్పుకొచ్చారు. ఎప్పుడూ ఆయన ఖాళీగా ఉండరూ. కనీసం ఒక్క నిమిషం కూడా వృథా చేయడానికి ఇష్టపడరు అంటూ తెలిపారు. ఇక ఒక్క నిమిషం ఖాళీగా ఉన్న ఆ సమయంలో ఏదో ఒక కొత్త పని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంటూ రాజారవీంద్ర తెలిపాడు. ఈ క్రమంలోనే ఇక కాస్త ఖాళీ సమయం దొరికితే ఎంతో మంది ప్రముఖులను తన ఇంటికి పిలిపించుకొని వారి దగ్గర కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని రాజారవీంద్ర చెప్పుకొచ్చారు. ఇక మెగాస్టార్ చిరంజీవి మెమరీ పవర్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు రాజా రవీంద్ర.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి