రాజకుమారుడు మూవీతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన సూపర్ స్టార్ కృష్ణ చిన్న కుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు, ఆ మూవీ తో భారీ సక్సెస్ కొట్టారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రాఘవేంద్ర రావు ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రీతీ జింతా హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత మహేష్ హీరోగా చేసిన ఏడవ సినిమా ఒక్కడు అప్పట్లో పెద్ద సెన్సేషనల్ సక్సెస్ అందుకుని ఆయనకు మరింత పేరు తెచ్చిపెట్టింది.

అయితే కొన్నాళ్ల తరువాత మహేష్ తో తొలిసారిగా పూరి జగన్నాథ్ తీసిన సినిమా పోకిరి. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించగా మంజుల ఘట్టమనేని, పూరి జగన్నాథ్ దీనిని నిర్మించారు. విడుదలకు ముందు మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా రిలీజ్ తరువాత అప్పటివరకు టాలీవుడ్ సినిమా చరిత్రలో ఉన్న గత రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టడంతో పాటు తెలుగు సినిమా ఖ్యాతిని నేషనల్ రేంజ్ కి తీసుకెళ్లింది. ఇక టాలీవుడ్ లో రికార్డ్స్ గురించి మాట్లాడుకోవడానికి పోకిరికి ముందు పోకిరికి తరువాత అని ఇప్పటికీ విశ్లేషకులు చెప్తూ ఉంటారు.  

మహేష్ బాబు ఈ సినిమాలో పండు, కృష్ణమనోహర్ అనే రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆడియన్స్ మనసు గెలుచుకున్నారు. ఇక పోకిరి సృష్టించిన సెన్సేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనాలి. ఈ సినిమాలో ప్రతి ఒక్క సీన్ తో పాటు డైలాగ్స్, సాంగ్స్, ఫైట్స్, విజువల్స్, బీజీఎమ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికీ కూడా సినిమాలోని చాలా అంశాలని ఆడియన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. ఆ విధంగా ప్రిన్స్ మహేష్ బాబుని సూపర్ స్టార్ మహేష్ బాబు గా ఎంతో గొప్ప శిఖరాలకు చేర్చింది ఈ పోకిరి మూవీ. ఈ మూవీ తో నిర్మాతలతో పాటు బయ్యర్లు అందరూ కూడా భారీ స్థాయిలో లాభాలు సొంతం చేసుకోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: