బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమాతో  తెలుగు తెరకు పరిచయమయ్యాడు. రావడమే బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకుని లక్కీ హీరోగా ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు  జోరుగా రెండో చిత్రంతో కూడా బాక్స్ ఆఫిస్ వద్ద పోటీ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు వైష్ణవ్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ఈ మూవీకి  కొండపొలం అనే డిఫరెంట్ టైటిల్ ను సెట్ చేశారు. ఇప్పటికే ఉప్పెన లాంటి సహజమైన కథతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవ్ ఇప్పుడు తన రెండో సినిమాకి కూడా అంతే సహజమైన వినూత్నమైన టైటిల్ ను అనౌన్స్ చేసి అంచనాలు అంతకంతకూ పెంచేశారు. మొదటి సినిమా తోనే తన సత్తా చాటిన వైష్ణవ్ తేజ్ ఇప్పుడు ఈ సినిమాతో మరో రేంజ్ కి వెళ్ళడం ఖాయం అంటున్నారు సినీ ప్రముఖులు.  

ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేస్తోంది.  అయితే ఈ మూవీ నుండి మరో లేటెస్ట్ అప్డేట్ ఇపుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ఇటీవలే ఈ సినిమాలో క్రిష్ కొన్ని మార్పులు చేసినట్లు వార్తలు వినిపించగా, ఇప్పుడు  "కొండపొలం" మూవీలో ఇంటర్వెల్ కు ముందు వచ్చే సీన్ ను సినిమాకే హైలెట్ గా ఉండేలా మార్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ సీన్ లో చిరు కూడా అలా మెరుపులా కనిపించనున్నారు అని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. అయితే ఈ విషయంపై ఓ క్లారిటీ రావాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ విషయాన్ని వెండి తెరపైనే రివీల్ చేసి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారట క్రిష్.

మొదట దసరా బరిలో దిగేందుకు ఈ సినిమా సిద్ధమయ్యింది అని అక్టోబర్ 8 న రిలీజ్ చేయబోతున్నామని చెప్పగా ఇపుడు అదే టైమ్ కి అఖిల్ మూవీ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" చిత్రం కూడా రిలీజ్ కు ముస్తాబు అవడంతో "కొండపొలం" మూవీ రిలీజ్ ఇంకొన్ని రోజులు వాయిదా వేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇంకో రెండు మూడు రోజుల్లో ఈ అంశం పై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: