పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ గా మారిన తర్వాత మళ్ళీ ఘనంగా వకీల్ సాబ్ మూవీతో వచ్చాడు. ఆ సినిమా కరోనా సమయంలో విడుదల అయినప్పటికీ రికార్డు వసూళ్లతో పవన్ స్టామినా ఏమిటో టాలీవుడ్ కు తెలిపింది. ఆ తర్వాత ఇక వరుస సినిమాలపై తన దృష్టిని పెట్టాడు. అందులో భాగంగానే మలయాళ రీమేక్ మూవీ భీమ్లా నాయక్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా తనకు సమానమైన పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఇందులో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తోంది.

ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన రోజు నుండి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.  కాగా ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరున్న ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి రెండు పాటలు విడుదల అయ్యాయి. మొదటిది టైటిల్ సాంగ్... భీమ్లా నాయకు అని సాగుతుంది. మరొకటి "ఎంత ఇష్టమయ్యా" అంటూ నిత్యామీనన్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పాడే పాట. ఏ రెండు పాటలు రిలీజ్ అయిన సమయంలో అధిక వ్యూస్ ను పొందినప్పటికీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు అంతగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి.

అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సంగీత దర్శకులలో టాప్ లో ఉన్నారు ఎస్ ఎస్ థమన్. అందుకే అతనిని ఏరికోరి ఈ సినిమాకు ఎంచుకున్నారు దర్శకనిర్మాతలు. అయితే ఇంతకు ముందు సినిమాలకు ఇచ్చిన విధంగా అయితే ఈ సినిమాకు మ్యూజిక్ లేదని చెప్పాలి. మొత్తానికి ఈ సినిమాలో థమన్ మ్యాజిక్ అయితే లేదు అని తెలుస్తోంది. మరి సినిమాకు అతి ముఖ్యమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయినా అదరగొడతాడా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: