టాలీవుడ్ లో అనేక జోనర్ ల మీద సినిమాలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని మాత్రమే విజయాలు సాధిస్తాయి మరి కొన్ని అనుకున్న విధంగా సక్సెస్ కావు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు చాలా పవర్ ఫుల్ కథలతో తెరకెక్కుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరో ఒక పోలీసు గా నటించిన సినిమాలపై అంచనాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అలంటి ఒక పోలీసు మూవీ అయిన "ధృవ" గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమా తమిళ్ లో 2015 లో రిలీజ్ అయిన "తని ఒరువన్" సినిమాకు రీమేక్ గా వచ్చింది. ఇందులో జయం రవి పోలీసు పాత్రలో నటించగా అరవింద్ స్వామి విలన్ గా చేసి అందరినీ మెప్పించాడు.

* ఈ సినిమాను చూసిన ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య తెలుగు రీమేక్ హక్కులను 5.5 కోట్లకు కొనుగోలు చేశారు. అంతే కాకుండా ఈ సినిమాలో హీరోగా మహేష్ బాబు కానీ లేదా రామ్ చరణ్ ను కానీ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత వేరే కారణాలతో మహేష్ ను కాకుండా రామ్ చరణ్ ను ఏ ప్రాజెక్ట్ లో ఫైనల్ చేశారు.

* ఈ సినిమా ఒరిజినల్ ను తెరకెక్కించిన మోహన్ రాజాను ఫైనల్ చేయాలని అనుకున్నారు. అయితే తెలుగు నేటివిటీ కి తగ్గట్లు తీయగలడా అన్న సందేహంతో సురేందర్ రెడ్డిని డైరెక్టర్ గా అనౌన్స్ చేశారు. మధ్యలో వంశీ పైడిపల్లి పేరు కూడా డైరెక్టర్ గా అనుకున్నారు.

* కేవలం ఈ సినిమా తమిళ్ స్క్రిప్ట్ ను తెలుగులో మార్చడానికి సురేందర్ రెడ్డి 6 నెలల సమయం తీసుకోవడం గమనార్హం.

* అయితే అప్పటికే బ్రూస్ లీ సినిమాతో దారుణమైన నష్టాలను చూసిన దానయ్య మళ్ళీ రామ్ చరణ్ తో ప్రయోగం చేయడానికి ముందుకు రాలేదు. అందుకే రీమేక్ రైట్స్ ను అల్లు అరవింద్ కు ఇచ్చేశాడు. అలా రామ్ చరణ్ తో నిర్మాతగా చేసిన రెండవ సినిమాగా ధృవ అయింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా మగధీర ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. అందుకే ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

* అనుకున్న విధంగానే ఈ సినిమాలో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. పోలీసుగా చేసిన రెండవ సినిమా ఇది. మొదట జంజీర్ రీమేక్ తుపాన్ మూవీలో నటించాడు. ఇందులో రామ్ చరణ్ సరసన కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేసి ఆకట్టుకుంది.

*  ఈ సినిమాలో ప్రతి ఒక్క పాత ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. హిప్ హాప్ తమీజ సంగీతాన్ని అందించారు.

* ఈ సినిమాను 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా టోటల్ రన్ లో ౮౯.౬ కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఘనవిజయాన్ని అందుకుంది.  

* ఈ సినిమా విజయంలో విలన్ పాత్ర చేసిన అరవింద్ స్వామి నటన వేరే లెవెల్ అని చెప్పాలి. ఎంతో హుందాగా ఉండే సైంటిస్ట్ పాత్ర;లో ఒదిగిపోయారు.



మరింత సమాచారం తెలుసుకోండి: