రాబోతున్న సంక్రాంతికి పెరిగిపోతున్న సినిమాల రిలీజ్ లిస్టును చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఇప్పటికే సంక్రాంతికి ‘సర్కారు వారి పాట’ ‘రాథే శ్యామ్’ ‘భీమ్లా నాయక్’ సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ను ప్రకటించాయి. మధ్యలో ‘ఆర్ ఆర్ ఆర్’ కూడ ఎంటర్ అయి జనవరి 7న తాను కూడ వస్తున్నాను అంటూ లీకులు ఇస్తోంది. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం మహేష్ ప్రభాస్ పవన్ లలో ఎందరు త్యాగం చేస్తారు అంటూ ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.


ఈచర్చలు ఇలా కొనసాగుతూ ఉండగానే నాగార్జున తాను కూడ సంక్రాంతి రేస్ లో ఉండబోతున్నట్లు సంకేతాలు ఇవ్వడం మరింత ఆశ్చర్యంగా మారింది. నాగార్జున నటిస్తున్న ‘బంగార్రాజు’ మూవీని కూడ సంక్రాంతి రేస్ లో దింపాలని భావిస్తూ తన డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. 2016లో సంక్రాంతికి విడుదలై నాగ్ కెరియర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈమూవీకి ప్రీక్వెల్ గా ‘బంగార్రాజు’ సినిమాను తీస్తున్నారు.


ఈమూవీలో నాగార్జున నాగచైతన్య లు కలిసి నటిస్తున్నారు. వాస్తవానికి ఈమూవీలో సమంత కూడ నటించవలసి ఉంది. అయితే చైతూ సమంతలు విడిపోవడంతో ఇప్పుడు ఆ రోల్ ను ఈ సినిమా స్క్రిప్ట్ నుండి తీసేశారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు చిత్రీకరణ ఫైనల్ దశకు చేరుకున్న ఈమూవీని ఏ ధైర్యంతో నాగార్జున సంక్రాంతి రేస్ లోకి దింపుతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.


ఒకవైపు ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ తన సంక్రాంతి రిలీజ్ డేట్ ను ఖరార్ చేసుకుని జాతీయ స్థాయిలో విడుదల కావడానికి దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరుపుతోంది అని వార్తలు వస్తుంటే వాటిని లెక్కచేయకుండా ఇప్పుడు నాగ్ ఎందుకు రంగంలోకి దిగుతున్నాడు అన్నది ఎవరికీ అర్థంకాని విషయంగా మారింది. ఈ విషయమై మరొక విధమైన కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల గురించి నాగ్ కు నమ్మకం లేకపోవడంతో ఇలాంటి లీకులు ఇస్తున్నాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: