కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తాజా సినిమా 'అన్నాత్తే' పై  అన్ని భాష‌ల‌కు చెందిన రివ్యూవ‌ర్లు మాత్ర‌మే కాదు.. ప్రేక్ష‌కులు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డ్డారు. చివ‌ర‌కు ర‌జ‌నీ కాంత్ వీరాభిమానులు కూడా ఓ ఉతుకు ఉతికేశారు. అస‌లు శివ ఇక మార‌వా ? ఇదేం చెత్త సినిమా.. సూప‌ర్ స్టార్ పిలిచి సినిమా చేద్దామ‌ని అవ‌కాశం ఇస్తే ఇంత చెత్త సినిమా చేస్తావా ? అంటూ మండిప‌డి పోయారు. అస‌లు కాలా , క‌బాలీ , పేట , ద‌ర్బార్ కంటే చాలా నాసిర‌కం సినిమా అని.. అస‌లు ఎప్పుడో 30 ఏళ్ల నాటి ముత‌క క‌థ తో శివసినిమా చేశాడ‌ని ఆడుకున్నారు.

శివ గ‌తంలో తీసిన సినిమాలు అన్నీ మిక్సీ లో వేసి జ్యూస్ తీస్తే వ‌చ్చిన సినిమాయే ఈ పెద్ద‌న్న అని ఆడేసుకున్నారు. అయితే ఇప్పుడు సినిమాకు ఎక్క‌డా పాజిటివ్ టాక్ రాక‌పోయినా కూడా సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అని నిర్మాత‌లు డ‌ప్పు కొట్టు కోవ‌డం ఓ షాక్ అయితే.. ఈ సినిమా ఏకంగా రు. 200 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింద‌ని చెప్పుకోవ‌డం మ‌రో షాక్‌.

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌లిపి అన్నాత్తే రు. 200 కోట్లు కొల్ల‌గొట్టింద‌ట‌. అందులో తొలి రోజే ఏకంగా రు. 70 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింద‌ని చెప్పుకుంటున్నారు. అస‌లు తెలుగు వాళ్ల‌కు కాదు క‌దా.. త‌మిళ్ వాళ్ల‌కే ఈ సినిమా ఎంత మాత్రం న‌చ్చ‌లేదు.. తొలి రోజే థియేట‌ర్ల ద‌గ్గ‌ర జ‌నాలు లేరు. మ‌రి అలాంటి సినిమా రు. 200 కోట్ల ఎలా వ‌సూళ్లు కొల్ల గొట్టిందిరా బాబు అని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

ర‌జ‌నీ ఈ ఏజ్ లో కాస్త ద‌మ్మున్న క‌థ‌ల‌తో సినిమాలు చేస్తే అవి ప్రేక్ష‌కుల గుండెల్లో కొన్ని కాలాల పాటు నిలిచి పోతాయి. అవ‌న్నీ వ‌దిలేసి ముత‌క క‌థ‌ల ను తీసుకుని సినిమాలు చేస్తూ ఆయ‌న ఫ్యాన్స్ ను తీవ్రంగా డిజ‌ప్పాయింట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: