ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోలుగా సత్తా చాటి టాలీవుడ్ లోకాన్ని ఏలిన దిగ్గజాల్లో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులు ముందుంటారు. వరుస చిత్రాలు అదే విధంగా సంచలన విజయాలను సాధిస్తూ తెలుగు సినీ పరిశ్రమ కీర్తి ప్రతిష్ఠలను నలుమూలలకు విస్తరింపజేసిన ఈ అగ్ర కథానాయకులకు ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పడం కంటే భక్తులు ఎక్కువని చెప్పాలి. నిజంగానే వీరిని హీరోలుగా అభిమానించడం కాదు దేవుళ్ళుగా ఆరాధించేవారు అభిమానులు. అలాంటి ఈ ఇద్దరు ఒకే స్క్రీన్ పై కనిపిస్తున్నారు అంటే ప్రేక్షకులకు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు, అంతగా వెండి తెర వీరి కాంబినేషన్ లో ధగధగా మెరిసిపోయేది . ఈ రేర్ కాంబోలో సినిమా వస్తుంది అంటే ఇక ఫ్యాన్స్ కి పండగే పండగ.
అదే విధంగా వీరు కలసి నటించిన దాదాపు అన్ని చిత్రాలు కూడా బాక్స్ ఆఫిస్ వద్ద భారీ హిట్స్ ను అందుకున్నాయి. వాటిలో గుండమ్మ కథ, సంసారం, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ ఇలా మొత్తం 14 చిత్రాలకు పై గానే ఈ ఇరు అగ్ర నాయకులు కనిపించి సందడి చేశారు. అయితే ఇపుడు అదే తరహాలో ఓ స్టార్ రేర్ కాంబో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అదేనండి జక్కన్న దర్శకత్వంలో ప్రాణం పోసుకుంటున్న మూవీ "రణం రౌద్రం రుధిరం". ఈ చిత్రంలో టాలీవుడ్ అగ్ర తారలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. మాములుగానే వీరిద్దరికీ విడివిడిగా ఎవరి ఫాలోయింగ్ వారికి ఉంది. ఇరువురికి సెపరేట్ గా అశేష అభిమాన గణం ఉంది.

 
అలాంటిది ఇపుడు ఈ ఇద్దరి లెజెండరీ హీరోలు ఒకే చిత్రం తో మనల్ని కలుస్తున్నారు అంటే ఆ క్రేజ్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఈ మూవీ నుండి ఏ చిన్న విషయం బయటికొచ్చినా క్షణాల్లో సెన్సేషనల్ న్యూస్ గా మారుతోంది. ఇక తాజాగా ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన "నాటు నాటు" సాంగ్ సంచనాన్ని సృష్టిస్తుండగా ఆ పాటలో వీరిద్దరూ ఒకరి భుజాలు మరొకరు చేయి వేసుకున్న ఫోటోను అలనాటి అగ్ర దిగ్గజాలు అయిన ఎన్టీఆర్,  ఏఎన్నార్ కలిసి ఉన్న ఫోటో తో మ్యాచ్ చేస్తూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుత ఈ పిక్ మరియు వార్త వైరల్ గా మారింది. ఏ నోట విన్నా ఈ క్రేజీ రేర్ కాంబినేషన్ గురించి వినిపిస్తోంది. అయితే ఈ క్రేజీ కాంబో కూడా రానున్న రోజుల్లో వరుస చిత్రాలు చేసి అప్పటి ఆ రేర్ కాంబినేషన్ తరహాలో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధులను చేయాలని అంతా ఆకాంక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: