తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొంత కాలం నుంచి ఎంతోమంది సినీ ప్రముఖులు దూరం అవుతూ ఉండడంతో అటు చిత్ర పరిశ్రమ మొత్తం విషాదంలోకి నెడుతుంది. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో వందల చిత్రాల్లో కొరియోగ్రాఫర్ గా పనిచేసిన శివ శంకర్ మాస్టర్ కరోనా వైరస్ బారినపడి ఊరికి తుది శ్వాస విడిచారు. ఇక ఇప్పుడు తన పాటలతో తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకొని.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు.  గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో  సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.



 ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో ప్రస్తుతం చిత్రపరిశ్రమ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు సేవ చేస్తున్న గొప్ప పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి  పరిశ్రమకు దూరం అవడం తీరని లోటు అంటూ సంతాపం తెలియజేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఎంతో మంది సినీ ప్రముఖులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం పై స్పందిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. అయితే పాటల రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి అందరు దర్శకులతో కూడా ఒకఅనుబంధం ఉంటుంది. కానీ అటు దర్శకుడు క్రిష్ తో మాత్రం ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇద్దరు గురు శిష్యుల మాత్రమే కాకుండా ఏకంగా తండ్రీకొడుకుల కూడా. ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమను చూపించుకునే వారు దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలను సమకూర్చారు అని చెప్పాలి. ఒకానొక సమయంలో క్రిష్ మీద సిరివెన్నెల అలిగారట. ఇక ఇటీవల ఈ విషయాన్నీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కృష్ణం వందే జగద్గురం సినిమాలో 14 నిమిషాల పాట రాశారట సిరివెన్నల సీతారామ శాస్త్రి   అప్పుడప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు వేస్తున్న తనకు ఆ పాట పై అపనమ్మకం కలిగింది అంటూ కృష్ చెప్పుకొచ్చారు. పాటలో రెండు మూడు చరణాలు వాడలేదు దీంతో గురువుగారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి కోపం వచ్చిందా నామీద అలిగారు అంటూ క్రిష్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: