నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన మూడవ సినిమా 'అఖండ' నేడు విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన మొదటి రోజు గుడ్ టాక్ తో సినిమా శుభసూచకం అందుకోవడం విశేషం. ఇందులో ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్ గా చేయగా శ్రీకాంత్‌, జగపతిబాబు, పూర్ణ, సుబ్బరాజు, అవినాష్‌, జగపతిబాబు, శ్రవణ్‌, తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. అందరూ కూడా వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారని సినిమా చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. అన్ని ఎమోషన్స్ ను సమపాళ్లలో కలగలిపిన ఈ చిత్రం మాకు బాగా నచ్చింది అంటూ ఆడియన్స్ ఉత్సాహంగా చెబుతున్నారు.

కాస్ట్యూమ్స్, మ్యూజిక్‌, ఫోటోగ్రఫీ, డైలాగ్స్, ముఖ్యంగా లొకేషన్స్, సెట్స్  సినిమాకి ప్లస్ అయ్యాయనే చెప్పాలి.  ఇక ఈ చిత్రంలో పూర్ణ పాత్రకు మంచి మార్కులు పడుతున్నాయి. మంచి పాత్ర పడాలేగాని పూర్ణ నటన ఎంత అద్భుతంగా ఎలివేట్ అవుతుందో ఈ సినిమా ద్వారా మరోసారి ప్రూవ్ చేశారు పూర్ణ. కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసే ఒక సిన్సియర్ లేడిగా పూర్ణ పీక్స్ లో  పర్ఫార్మెన్స్ ను ఇచ్చింది. ఎమోషన్స్ తో సీన్స్ ను బాగా పండించారు పూర్ణ. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మారిన హీరోయిన్ పూర్ణకు అవకాశాలు పెరుగుతున్నాయి. గత వారం ఓ టి టిలో విడుదలైన 'దృశ్యం 2' లో కూడా పూర్ణ ఒక కీలక పాత్ర పోషించారు.

ఆ పాత్ర సినిమాకు ప్లస్ అయినా అవకపోయినా తాను మాత్రం లాయర్ గా తాను ఉన్న కొద్దీ సమయం డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. ఇప్పుడు అఖండలో కూడా పూర్ణ పాత్ర బాగుండడంతో మరిన్ని అవకాశాలు వస్తాయని అంతా అనుకుంటున్నారు. ఒక హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పూర్ణ కథను బట్టి అందివచ్చిన ప్రతి పాత్రలు చేసుకుంటూ వెళుతోంది. భవిష్యత్తులో మరిన్ని పాత్రలు రావాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: