గత కొద్ది రోజులుగా మెగా ఫామిలీకి సంబంధించిన ఒక విషయం వైరల్ గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన చెల్లెలు త్వరలో ఓ ఇంటి కోడలు కాబోతున్నది. దీనికి సంబంధించి ఉపాసన పుట్టింట్లో పెళ్లి వేడుకలు మొదలయిన విషయం విదితమే. ఆమె సోదరి అనూష పాల త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. కాగా ఆమె సంగీత్ బాధ్యతలను ప్రముఖ మహిళా కొరియోగ్రాఫర్ మరియు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ అనీ మాస్టర్ చూసుకుంటున్నారు. ఈ పెళ్లిని ఎంతో అంగరంగ వైభవంగా జరుపనున్నారు అని సోషల్ మీడియా అంత కోడై కూస్తోంది. ఇదిలా ఉండగా ఈ సంగీత్ లో మరో ప్రత్యేకం ఉండబోతోంది అంటూ వార్తలు వినపడుతున్నాయి.

ఈ సంగీత్ లో పవన్ మరియు రేణు దేశాయ్ ల ముద్దుల కూతురు ఆద్య ఒక లైవ్ షో చేయనుంది అని వార్తలు వినబడుతున్నాయి. ఆద్య కు గిటార్ వాయించడం అంటే ఎంతో ప్రీతికరం అని తెలిసిందే. ఇప్పుడు తనకు తెలిసిన ఈ టాలెంట్ ను ఈ పెళ్ళిలో ప్రదర్శించనుంది అని వినబడుతోంది. దీనికి రేణుదేశాయ్ కూడా ఒకే చెప్పారట. ప్రస్తుతం ఆద్య అందుకోసం ప్రాక్టీస్ కూడా మొదలెట్టేసి నట్లు సమాచారం.

ఇటీవలే ఆద్య చేతిలో గిటార్ పట్టుకుని వాయిస్తూ పాట పాడిన వీడియో సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయింది తెలిసిందే. అయితే ఇపుడు తను మరో సారి ఈ సంగీత్ వేడుకలో తన గిటార్ టాలెంట్ చూపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుందిగా ఈ అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరదలి పెళ్లి బాధ్యతలను దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. పెళ్లి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ మెగా అభిమానులకు కనులు విందు చేస్తున్నారు. ఈ పెళ్ళికి అటు రామ్ చరణ్ ఫ్రెండ్స్ మరియు ఉపాసన ఫ్రెండ్స్ విచ్చేయనున్నారని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: