టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప సినిమా విడుదల కాబోతోంది. మరికొన్ని గంటల్లో థియేటర్లలో ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయి ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేయబోతోంది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాలిక్యులేటర్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదిన విడుదల కాబోతుంది. అయితే అటు ఏపీలో ప్రీమియర్ షోలకు అనుమతి లేకపోయినప్పటికీ తెలంగాణలో మాత్రం ప్రీమియర్ షోలు ప్రదర్శించబోతున్నారు. దీంతో ఏపీ నుంచి అభిమానులు సైతం తరలివచ్చి తెలంగాణలో ప్రీమియర్ షోలు వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు.



 అయితే పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కిన పుష్ప సినిమా ప్రస్తుతం భారీగా రికార్డులను కొల్లగొడుతుంది అనీ తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది. ఇక ఇప్పుడు విడుదలకు ముందు ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా పుష్ప దుమ్మురేపుతోంది అన్నది తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప సినిమాకు భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.  ఇక ప్రపంచ వ్యాప్తంగా పుష్ప కు 144.90 కోట్లు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


 ఇక తెలుగు రాష్ట్రాల్లో 101.75 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే టాలీవుడ్ లో ఎక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల జాబితాలో పుష్ప కూడా చేరిపోయింది. ఏకంగా నాలుగవ స్థానాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇలా ఇప్పటి వరకు టాలీవుడ్ లో  ఎక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల్లో మొదటి స్థానంలో బాహుబలి 2 సినిమా ఉంది.తర్వాత సాహో, సైరా నర్సింహారెడ్డి సినిమాలు ఉన్నాయి. అయితే బాహుబలి మొదటి పార్ట్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను బీట్ చేసి నాల్గవ స్థానానికి చేరుకుంది అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: