టాలీవుడ్ డార్లింగ్ గా పిలవబడే ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న "రాధేశ్యామ్" మూవీజనవరి 14 న సంక్రాంతి పండుగ బరిలోకి దిగేందుకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని అంతా అనుకుంటున్నారు. పీరియాడిక్ లవ్స్ స్టొరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో రెబల్ స్టార్ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో పూజ హెగ్డే పాత్ర కూడా మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతుంది అని తెలుస్తోంది.

ఇటీవలే ఈ పాన్ ఇండియా మూవీ  ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో రామోజీ ఫిలింసిటీలో ఎంతో వైభవంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు  జాతిరత్నాలు సినిమా హీరో నవీన్ పోలిశెట్టి యాంకర్ గా చేసి అందరినీ అలరించారు. ఈ సినిమా కోసం ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్, లుక్, టీజర్, పాటలు అన్నీ కూడా సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. ఒక అందమైన చరిత్ర కలిగిన ప్రేమకథను మనకు చూపించడానికి "రాధే శ్యామ్" టీమ్ జనవరి 14 న మన ముందుకు రానున్నారు.

తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఎన్ని ప్రేమకథలతో సినిమాలు వచ్చినా వేటికవే సాటి అని రుజువు చేసుకున్నాయి. అటువంటి అందమైన ప్రేమకథలలో ఒకటిగా ఇది కూడా నిలుస్తుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా ట్రైలర్ లో చూపిన మ్యాజిక్ సినిమాలో ఉంటుందా? తెలుగు సినిమా చరిత్రలో ఒక అద్భుతమైన ప్రేమకావ్యంగా మిగిలిపోనుందా? తెలుగు టైటానిక్ అనే పేరును సార్ధకం చేసుకుంటుందా? అన్న పాలు ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇంకో రెండు వారాలు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: