స్టార్ ఫ్యామిలీస్ సంక్రాంతి వేడుకల్లో ముగినిపోయాయి గా . ఎప్పటిలాగే మెగాస్టార్ చిరంజీవి కుటుంబం మరియు ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు.

ఇరువురు కలిసి భోగి వేడుకలు జరుపుకుంటున్న వీడియోను తాజాగా వరుణ్ తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో చిరు మరియు వరుణ్ తేజ్‌ కలిసి దోసెలు వేస్తున్న సీన్ భలే ఫన్నీగా ఉంది. తన కంటే వరుణ్ వేసిన దోసె బాగా రావడంతో చిరు చిన్నపిల్లాడిలా అతనితో గొడవపడ్డారట..


పాపం చిరు వేసిన దోసె పెనానికి అతుక్కుపోయిందట.పక్కనే వరుణ్ వేసిన దోసె బాగా రావడంతో.. 'నాకు కుళ్లు వచ్చేసింది..' అంటూ చిరు చిన్నపిల్లాడిలా గొడవపడే ప్రయత్నం కూడా చేశారు. వరుణ్ వేసిన దోసెను గరిటెతో చెడగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో చూసి మెగా అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఇద్దరి మధ్య సరదా గొడవ ఎంత క్యూట్‌గా ఉందో అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. పోస్ట్ చేసిన కాసేపటికే లక్ష పైచిలుకు వ్యూస్‌తో ఈ వీడియో బాగా వైరల్‌గా మారింది.

గతేడాది మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల్లో హీరో నాగార్జున కూడా పాల్గొన్న విషయం అందరికి తెలిసిందే. ప్రతీ ఏటా మెగా ఫ్యామిలీ అంతా ఒకే చోట సంక్రాంతి వేడుకలు జరుపుకుంటూ వుంటారు.కొడుకులు మరియు కూతుళ్లు, అల్లుళ్లతో సందడి వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా మెగా ఫ్యామిలీ అంతా ఒక చోట చేరి పండగ జరుపుకుంటున్నారు. ఇక అటు నందమూరి బాలకృష్ణ కుటుంబం ఈసారి సంక్రాంతి వేడుకలకు ఆయన సోదరి ఇళ్లు అయిన కారంచేడు వెళ్లారు. సోదరి పురందేశ్వరి, బావ వెంకటేశ్వరరావుల ఇంట్లో ఈసారి సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారట బాలయ్య.ఇలా టాలీవుడ్ స్టార్ ఫామిలీస్ అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ పండగ జరుపుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: