టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. సౌత్ లోనే ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో చేతిలో లేని ప్రాజెక్టులు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, ఆది పురుష్ సినిమాల షూటింగ్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. రాధేశ్యామ్ సినిమా మార్చి నెలలో విడుదల కానుందని వార్తలు వస్తూ ఉండగా.. ఆదిపురుష్ మాత్రం ఆగస్టు 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక తర్వాత ప్రభాస్ నటిస్తున్న సలార్, ప్రాజెక్ట్ కె ఈ రెండు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి.

సలార్ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తూ ఉండగా, ప్రాజెక్టు కె సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక వీటితో పాటు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే పేరుతో మరో సినిమా తెరకెక్కుతోంది. అయితే ప్రభాస్ ఈ ఐదు సినిమాలతో పాటు మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ వార్ మూవీ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో రాబోయే మల్టీస్టారర్ సినిమాలో ప్రభాస్ నటించనున్నారని సమాచారం. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతోంది.

ఈ సినిమాతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కే ఒక సినిమాకు, మరో టాలీవుడ్ నిర్మాతకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అంటే దాదాపు 2026 సంవత్సరం వరకు ప్రభాస్ డేట్లు ఖాళీ గా ఉండవనిని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు విడుదల అయ్యేలా ప్రభాస్ తన కెరియర్ను ప్లాన్ చేసుకుంటున్నాడట. అంటే 2026 సంవత్సరం లోపు ప్రభాస్ నటించిన 8 సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు ప్రభాస్ పెళ్లి వార్త కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి సినిమాలతోపాటు ఈ సంవత్సరమైనా ప్రభాస్ తన పెళ్లి పై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: