కానీ ఇక్కడ ఒక హీరో మాత్రం దుర్భర జీవితాన్ని గడుపుతున్నాడు అన్నది తెలుస్తుంది. అయ్యో పాపం ఎందుకు అతనికి అవకాశాలు లేక అంత దుస్థితి వచ్చిందా అని అంటారా అవకాశాలు పుట్టి గా ఉన్నాయి. కానీ కొన్ని కారణాల వల్ల అతను కేవలం ఒక వ్యాన్లో జీవితాన్ని గడుపుతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు భారత ప్రేక్షకులకు కూడా తెలిసిన వాడే. ఆక్వా మ్యాన్ అనే సినిమాతో హీరోగా పరిచయమై యాక్షన్ సీక్వెన్స్ తో ప్రేక్షకులందరినీ కట్టి పడేసాడు జాసన్ మోమేవా. ఆ తర్వాత గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే మరో హాలీవుడ్ సినిమాలో ఎంతగానో గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇలా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఈ హీరో ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు. మరి అతనికి అలాంటి దుస్థితి ఏంటి అని అనుకుంటున్నారు కదా.. తన భార్య లీసా తో 17 బంధాన్ని ఇటీవలే తెంచుకున్నాడు జాసన్ మోమేవా. ఈ క్రమంలోనే భార్య పిల్లలతో ఉండగా.. జాసన్ మాత్రం ఒంటరిగా ఉంటున్నాడు. దీంతో ఇక కనీసం హోటల్ రూమ్ కి కూడా షిఫ్ట్ కాకుండా ఇంటికి పిల్లలకి దగ్గర్లోనే వారిని రోజు చూడటానికి ఒక వ్యాన్ లోనే కాలం వెళ్లదీస్తున్నారు. మిత్రుడు ఇంటి ముందు తన వ్యాన్ను పార్క్ చేసుకొని అందులో ఉంటూ.. ఇక అక్కడ నుంచి పిల్లలను చూస్తూ ఆనంద పడుతున్నాడు జాసన్ మోమేవా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి