విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆయన హీరోగా నటిస్తున్న ఎఫ్ 3 సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఆయన కెరీర్ లో గ్యాప్ అనేది ఇప్పటి వరకూ పెద్దగా రాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు సినిమాలను చేసుకుంటూ పెద్దగా గ్యాప్ అనేది లేకుండా చూసుకుంటాడు. అలాంటి ఆయన కెరీర్ లో ఇప్పటివరకు రాని గ్యాప్ ఇప్పుడు రాబోతుందని తెలుస్తుంది.

 ఎందుకంటే ఇప్పుడు ఆయన చేయవలసిన తదుపరి సినిమా ఒకటి కూడా సెట్స్ పైనకి వెళ్లలేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న ఎఫ్ 3 సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అంతేకాదు నెట్ ఫ్లిక్స్ కు సంబంధించిన ఓ వెబ్ సిరీస్ ను కూడా చేస్తున్నాడు. అవి పూర్తయిన తర్వాత వెంకటేష్ ఏం చేస్తున్నాడు అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. గతంలో రీమేక్ సినిమాలు చేయడంలో వెంకటేష్ ఎంతో త్వరగా నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు. అలా ఇప్పటివరకు రీమేక్ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ హీరో ఇప్పుడు ఆ విధమైన సినిమాలను కూడా ఓకే చెప్పకపోవడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

ఓ వైపు తన తోటి సీనియర్ హీరోలు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. చిరంజీవి ఏకంగా నాలుగు సినిమాలు చేస్తున్నాడు. రాజశేఖర్ కూడా మంచి మంచి సబ్జెక్టులను ఎంచుకుని సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ రీమేక్ సినిమానే కాకుండా డైరెక్ట సినిమాలను కూడా చేయకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఎప్పటినుంచో తేజ మరియు తరుణ్ భాస్కర్ వంటి దర్శకులతో సినిమాలు చేయాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో వారి కథలు ఇంకా ఫైనల్ కాకపోవడంతో ఇంకా స్క్రిప్టు దశలోనే ఆయన సినిమాలు ఉండిపోయాయి. ఇంకోవైపు కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయాలని కూడా ఆయన ముందు అడుగు వేస్తూ ఉండగా దానికి మరింత టైం ఉండడంతో ఇప్పుడు ఆయనకు రావడం తప్పేలా అని అనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: