కొరటాల
శివ దర్శకత్వం వహిస్తున్న
ఎన్టీఆర్ సినిమా రోజురోజుకు ఆలస్యం కావడంతో
ఎన్టీఆర్ అభిమానులు ఎంతో నిరాశలో ఉన్నారు. గతంలో చాలా ఫ్లాప్ లతో ఇబ్బంది పడిన
ఎన్టీఆర్ కొంతకాలంగా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. అలా
ఎన్టీఆర్ కొరటాల శివ తో మరో
సినిమా చేస్తున్నాడు అనగానే ఆయన అభిమానులకు బాగానే సంతోషం వేసింది.
డైరెక్టర్ పూరీ జగన్నాథ్
టెంపర్ నుంచి
త్రివిక్రమ్ అరవింద సమేత వీర రాఘవ
సినిమా వరకు భారీ స్థాయిలో విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే దర్శకధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్
సినిమా లో కూడా ఆయన హీరోగా నటిస్తున్నాడు.
త్వరలోనే ఈ
సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో తన తదుపరి
సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని
ఎన్టీఆర్ భావించగా
కొరటాల శివ తో
సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ
సినిమా విషయం లో ఎంతో ఎంతో టెన్షన్ నెలకొంది అభిమానులకు. జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన ఈ ప్రాజెక్టుపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే వీరిద్దరి కాంబినేషన్ లో
సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయమని సోషల్ మీడియాలో ఫిలింనగర్ లో మారు మోగిపోయింది.
అయితే ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ
మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల పట్టలేకపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెలలోనే ఈ
సినిమా ప్రారంభం అవుతుందని భావించిన
ఎన్టీఆర్ అభిమానులకు కాకపోవడం నిరాశ పరిచింది. ఎందుకు ఈ
సినిమా ప్రారంభం కావడం లేదని ఆరాతీయగా ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాలేదని అది పూర్తికాగానే భారీ స్థాయిలో లాంచ్ చేయబోతున్నారని అంటున్నారు.
కొరటాల శివ వంటి అగ్ర
రచయిత దర్శకుడికి ఈ విధమైన ఇబ్బందులు ఎదురవడం నిజంగా దురదృష్టం అనే చెప్పాలి ఇప్పటివరకు ఒక్క అపజయం లేని
శివ ఆచార్య సినిమాతో హిట్ అందుకొని ఈ సినిమాను భారీగా మొదలు పెడితే బాగుంటుంది అనేది
సినిమా విశ్లేషకుల అంచనా.