ఇక జనాలు ఎంతగానో ఎదురు చూస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు రియాల్టీ షో చూడటం కోసం డిస్నీ+హాట్ స్టార్ లో ఒక మిలియన్ కి పైగా లాగిన్స్ తో సరికొత్త రికార్డులు సృష్టించారు బిగ్ బాస్ అభిమానులు.డిస్నీ+హాట్ స్టార్ పై కొత్త రికార్డును సృష్టిస్తూ బిగ్ బాస్ నాన్ స్టాప్ అత్యధిక వ్యూయర్స్ తో పాటుగా వ్యూ టైం ని కూడా నమోదు చేసింది. ఇక ఈ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మొట్ట మొదటిసారిగా ఇంతటి భారీ విజయం నమోదు చేసిన తొలి తెలుగు రియాల్టీ షోగా రికార్డు సృష్టించింది. డిస్నీ+హాట్ స్టార్ వ్యూయర్స్ బిగ్ బాస్ షో పట్ల విపరీతమైన అభిమానం చూపడంతో పాటుగా తొలి రోజు నుంచే మాక్సిమం వ్యూ టైం ని నమోదుచేశారు.


డిస్నీ+హాట్ స్టార్ కంటెంట్ హెడ్ ఇంకా డిస్నీ స్టార్ ఇండియా ఎంటర్టైన్మెంట్ నెట్ వర్క్ హెచ్ఎస్ఎం గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ '' బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు రియాల్టీ షో కు వచ్చిన స్పందన పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ షోను డిస్నీ+హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయడం ఆరంభించిన మరుక్షణమే చూడటానికి రికార్డు సంఖ్యలో ప్రేక్షకులు సిద్ధమయ్యారు. ఈ షో పట్ల వీక్షకుల ఆసక్తి ఇంకా అలాగే ప్రతిస్పందన కు ఇది అద్దం పడుతుంది' అని అన్నారు.ఇక అక్కినేని నాగార్జున మాట్లాడుతూ '' ఎల్లప్పుడూ కూడా అండగా ఉండే మా ప్రేక్షకులకు నేను ధన్యవాదములు చెబుతున్నాను. ప్రతిసారీ బిగ్ బాస్ షో విభిన్నంగా చేయడానికి ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడు డిస్నీ+హాట్ స్టార్ లో బిగ్ బాస్ నాన్ స్టాప్ రికార్డులను సృష్టిస్తూ వుంది. ఓపెనింగ్లూ బాగా వచ్చాయి. ఇది నాకెంతో సంతోషంగా ఉంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ తో నాన్ స్టాప్ వినోదం అందుతుంది' అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: