కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాత్ మరణం అభిమానులందరినీ ఎంత శోకసంద్రంలో ముంచేసింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పునీత్ అందరికీ దూరమై రోజులు గడుస్తున్నా ఇంకా అభిమానులు ఆయన జ్ఞాపకాలు లోనే ఉన్నారు. పునీత్ రాజ్కుమార్ కేవలం సినిమాలో స్టార్ హీరోగా మాత్రమే కాదు.. పేద ప్రజలందరికీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతో మంది గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి చిన్న వయసులోనే హఠాత్ మరణం చెందడం అందరిని దిగ్భ్రాంతికి  గురిచేసింది.


 ఇక కేవలం తమిళ ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు మాత్రమే కాదు భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే  సినీ ప్రముఖులు పునీత్ రాజ్కుమార్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పటికి ఎంతోమంది ఆయన చేసిన సామాజిక సేవలు చిత్ర రంగానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఇటీవలె పునీత్ రాజ్కుమార్ అభిమానులందరూ గర్వపడే ఒక వార్త  వైరల్ గా మారిపోయింది. పునీత్ రాజ్కుమార్ పేరుతో నింగిలోకి ఒక శాటిలైట్ ను ప్రవేశపెట్టి పోతున్నారు. ఇస్రో సహకారంతో శాటిలైట్లను ప్రయోగించపోతున్నారు అన్నది తెలుస్తుంది. అయితే ఈ శాటిలైట్ ను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రూపొందించడం గమనార్హం.


 భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఒక ఉపగ్రహాన్ని తయారు చేస్తూ ఉన్నారు. కాగా దీనిని నింగిలోకి పంపేందుకు ఇస్రో కూడా పూర్తి సహకారాన్ని అందించేందుకు సిద్ధమైంది. కర్ణాటకలోని 20 ప్రభుత్వ స్కూళ్లలో ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 100 మంది విద్యార్థులతో ఇక ఈ సరికొత్త ఉపగ్రహం తయారుచేసే ప్రాజెక్టును చేపడుతున్నారు. బెంగుళూరులోని మల్లేశ్వరం లో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ మంత్రి అశ్వర్థ నారాయణ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించా.రు 1.90 కోట్లతో ఉపగ్రహాన్ని తయారు చేయనున్నారు. కేవలం కిలోన్నర బరువు మాత్రమే ఉపగ్రహం ఉండబోతుందట. దీనికి పునీత్ రాజ్ కుమార్ పేరు పెట్టబోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: