టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు ప్రేమ వివాహం చేసుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా దశాబ్దాల కిందట ప్రేమ వివాహం చేసుకొని ఇప్పటికి అన్యోన్యంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక అలాంటి వారిలో ప్రస్తుతం టాలీవుడ్ లో ఎవర్గ్రీన్ జంటగా కొనసాగుతుంది శ్రీకాంత్ ఊహ జంట. తనతో పాటు నటించిన హీరోయిన్ ఊహ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు శ్రీకాంత్. అయితే ఊహించని రేంజిలో ట్విస్ట్ లతో ఇక వీరి ప్రేమ పెళ్లి జరిగింది అని ఇండస్ట్రీలో టాక్. ఇక ప్రస్తుతం పెళ్లి తర్వాత ఊహ సినిమాలకు పూర్తిగా దూరమైంది. శ్రీకాంత్  మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.


 మొన్నటివరకు హీరోగా తెలుగు ప్రేక్షకులకు వరుస సినిమాలతో పలకరించిన శ్రీకాంత్.. ఇక ఇటీవల కాలంలో విభిన్నమైన పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాతో విలన్గా కూడా మారిపోయాడు శ్రీకాంత్. అయితే శ్రీకాంత్ ఇటీవల ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. తన ప్రేమ పెళ్లి గురించి కొన్ని విషయాలను బయటపెట్టారు. ఈ క్రమంలోనే తన భార్యతో ప్రేమలో ఎలా పడ్డాడు.. చివరికి పెళ్లి వరకు ఎలా వెళ్ళింది అన్న విషయాన్ని తెలిపాడు. అంతేకాదు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరూ కూడా ఇబ్బంది పెట్ట లేదని తన కష్టాన్ని నమ్ముకుని పైకి వచ్చాను అంటూ శ్రీకాంత్ చెబుతున్నాడు.



 ఇక తన భార్య ఊహతో సినిమాల ద్వారా పరిచయం ఏర్పడిందని.. ఇక ఆ తర్వాత తన ఇంట్లో జరిగే అన్ని ఫంక్షన్లకు కూడా ఊహ వచ్చేది అంటూ తెలిపాడు శ్రీకాంత్. ఇక అలా తమ మధ్య ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారిందని ఇక మొదట ఊహకు నేనే ప్రపోజ్ చేశా అంటూ శ్రీకాంత్ చెప్పాడు. తన ప్రేమకు ఊహ ఈజీగానే ఓకే చెప్పడంతో తానే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడానని తెలిపాడు శ్రీకాంత్. అయితే సినిమాల్లో తప్ప మరే బిజినెస్ లో ఎంట్రీ ఇవ్వలేదని సినిమా మాత్రమే తన ప్రపంచం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఎవర్గ్రీన్ జంటకు ముగ్గురు సంతానం. పెద్దకొడుకు రోషన్ ఇప్పటికే టాలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: