ఒక సినిమా హిట్ అవ్వాలంటే అందులో సంగీతానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. అయితే సంగీతం బాగా రావాలంటే మంచి పాటలు రచించాలి. అలాంటి ఎందరో సినీ పాటల రచయితలు మనకు ఎన్నో అద్బుతమయిన పాటలను అందించి మనకు వినోదాన్ని అందించారు. అలాంటి వారిలో ఒకరే ప్రముఖ గేయ రచయిత కందికొండ. ఇతను పూర్తి పేరు కందికొండ యాదగిరి. ఇతని స్వస్థలం తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట దగ్గర లోని నాగుర్లపల్లి. ఇతను ఉస్మానియా యూనివర్సిటీ లో తెలుగులో ఎం ఏ పూర్తి చేశారు. ఇతనికి రచనలు పై ఉన్న మక్కువ తోనే  సినీ రంగంలోకి వచ్చాడు. అలా తన రచనలతో అనతి కాలంలోనే మంచి రైటర్ గా పేరు తెచ్చుకున్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం కందికొండ కాసేపటి క్రితమే క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ మరణించినట్లు తెలుస్తోంది. దీనితో ఒక్క సారిగా తెలుగు సినిమా ప్రేక్షకులు విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం కందికొండ వయసు కేవలం 49 సంవత్సరాలు గా తెలుస్తోంది. చిన్న వయసులోనే ఆ దేవుడి ఇతనికి ఇంత అన్యాయం చేశారు. ఈ క్యాన్సర్ వ్యాధితో గత కొద్ది సంవత్సరాలుగా బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే చికిత్స తీసుకుంటూ ఇక నాయంవవుతుంది అని అందరూ భావించారు. కానీ అనుకోకుండా ఇలా జరగడం నిజంగా దురదృష్టకరం. ఈయన తెలుగు ప్రేక్షకులను అందించిన పాటలలో చాలా వరకు మెలోడీ సాంగ్స్ నే రాయడం విశేషం.

కందికొండ రచించిన పాటలలో మల్లి కూయవే గువ్వా..., మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా..., చూపుల్తో గుచి గుచి..., మధురమే మధురమే... లాంటి పాటలను రచించి తెలుగు ప్రేక్షకుల మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఇతని మరణం తెలుగు సినిమా ప్రపంచానికి తీరని లోటు అని చెప్పాలి. ఈయన మృతి పట్ల ప్రముఖులు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: